Amit Shah RGF : రాజీవ్ ఫౌండేషన్ కు చైనా నుంచి నిధులు
ఎఫ్‌సీఆర్ఏ లైసెన్స్ రద్దు చేశామన్న అమిత్ షా
Amit Shah RGF : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. అంతే కాకుండా రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు చైనా నుంచి నిధులు వచ్చాయని స్పష్టం చేశారు. మంగళవారం అమిత్ షా మీడియాతో మాట్లాడారు. అందుకే విదేశీ నిధుల లైసెన్స్ (ఎఫ్‌సీఆర్ఏ) ను రద్దు చేసినట్లు చెప్పారు.
2005 నుంచి 2007 మధ్య రాజీవ్ గాంధీ ఫౌండేషన్ చైనీస్ ఎంబసీ నుంచి రూ. 1. 35 కోట్లు పొందిందని ఆరోపించారు. ఇందుకు సంబంధించి తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు అమిత్ షా(Amit Shah RGF). అందుకే మొత్తం పరిశీలించిన తర్వాత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆర్జీఎఫ్ కు సంబంధించి ఎఫ్‌సీఆర్ఏ రిజిస్ట్రేషన్ ను రద్దు చేసిందన్నారు.
ఇలా ఉండగా ఎఫ్‌సీఆర్ఏ ను గత ఏడాది అక్టోబర్ లో నిలిపి వేసినట్లు వెల్లడించారు కేంద్ర హొం శాఖ మంత్రి. ఇదే సమయంలో అరుణాచల్ ప్రదేశ్ లోని ఎల్ఏసీ వెంట భారత్ , చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశారు. దీంతో అమిత్ షా స్పందించారు.
కాంగ్రెస్ కావాలని రాద్దాంతం చేస్తోందన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ ఉన్నంత కాలం, భారతీయ జనతా పార్టీ పవర్ లో ఉన్నంత కాలం భారత్ ను టచ్ చేసే దమ్ము ఎవరికీ లేదని, ఏ దేశానికి సత్తా లేదని కుండ బద్దలు కొట్టారు అమిత్ షా. అయితే చైనా దాడుల గురించి ప్రస్తావిస్తున్న కాంగ్రెస్ పార్టీ తన ట్రస్టుకు చైనీస్ ఎంబసీ నుంచి రూ. 1.35 కోట్ల నిధులు ఎలా పొందుతుందని ప్రశ్నించారు.
సోనియా గాంధీ ఫౌండేషన్ కు ఉగ్రవాదంతో సంబంధం ఉందని ఆరోపించారు. ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ ఫౌండర్ జకీర్ నాయక్ నుండి రూ. 50 లక్షలు తీసుకున్నారని మండిపడ్డారు.
Also Read : ఎన్నికలంటే వ్యాపారం కాదు – జైరాం