Raja Pateria : తగ్గేదే లే అంటున్న రాజా పటేరియా
మోదీపై కామెంట్స్ పై డోంట్ కేర్
Raja Pateria : మోదీని చంపేయండంటూ మధ్య ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు , మాజీ మంత్రి రాజా పటేరియాను(Raja Pateria) అరెస్ట్ చేశారు. అయినా ఎక్కడా తగ్గేది లేదంటున్నారు. అంతే కాదు ఆయన విక్టరీ సింబల్ చూపించారు. ఇందుకు సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. రాజా పటేరియాను మంగళవారం ఉదయం పన్యా పోలీసులు అరెస్ట్ చేశారు.
మోదీని చంపేయమంటూ కార్యకర్తల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఆ దృష్టిలో అనలేదని స్పష్టం చేశారు. ఈ దేశంలో భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, దానిని రక్షించు కోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు రాజా పటేరియా.
ఇందులో తాను అన్న దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా పన్నాలో పీఎం మోదీపై చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి చేసిన ఆరోపణలపై తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు రాజా పటేరియాకు బెయిల్ ఇవ్వడం కుదరదంటూ స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా బెయిల్ ఇవ్వక పోవడాన్ని తప్పు పడుతూ రాజా పటేరియా విక్టరీ సింబల్ చూపించారు. ఈ దేశంలో ప్రశ్నించడం నేరగా మారిందన్నారు. ప్రస్తుతం ఆయన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ కేబినెట్ లో మంత్రిగా కూడా పని చేశారు.
జిల్లా కోర్టు బెయిల్ నిరాకరించిన తర్వాత తాను ఉగ్రవాదిని కానని మహాత్మా గాంధీ అనుచరుడినంటూ చెప్పారు. కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు రాజా పటేరియా(Raja Pateria). ఇది భావజాల పోరాటం. నేను ఆ మాటలు అనలేదు. నేను ఇప్పటికీ గాంధీ సిద్దాంతాన్ని అనుసరిస్తా. హింనను ఎలా ప్రోత్సహిస్తానని ప్రశ్నించారు.
Also Read : రాజీవ్ ఫౌండేషన్ కు చైనా నుంచి నిధులు