Rahul Gandhi : ద్వేషిస్తే దేశం మిగలదు – రాహుల్ గాంధీ
కేంద్ర సర్కార్ పై అగ్ర నేత కామెంట్స్
Rahul Gandhi : ప్రేమిస్తే కొంతైనా మార్పు చేయగలం. కానీ ద్వేషిస్తే దేహమే కాదు దేశాన్ని కూడా నాశనం చేస్తుందన్నారు కాంగ్రెస్ అగ్ర నాయకుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi). ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర మంగళవారం రాజస్థాన్ లో కొనసాగుతోంది. రాహుల్ తో పాటు సోదరి ప్రియాంక గాంధీ, మేన కోడలు, బావ మరిది రాబర్ట్ వాద్రాతో పాటు సీఎం అశోక్ గెహ్లాట్ , కీలకమైన యువ నాయకుడు సచిన్ పైలట్ కూడా పాల్గొన్నారు.
వేలాది మంది మహిళలు మద్దతు తెలిపారు. పెద్ద ఎత్తున అడుగులో అడుగు వేశారు. ఈ దేశానికి కావాల్సింది ప్రేమ కానీ ద్వేషం కాదన్నారు. ద్వేషం వల్ల విద్వేషాలు కొనసాగుతాయని కానీ తాము వాటిని ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు. ఇప్పటికే కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజలను విడదీయడం మంచి పద్దతి కాదన్నారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).
పాదయాత్ర సందర్భంగా యువ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. సవాయి మాధోపూర్ జిల్లా జీనాపూర్ ప్రాంతం నుంచి తిరిగి ప్రారంభమైంది భారత్ జోడో యాత్ర. అదే జిల్లా లోని డెహ్లాడ్ ప్రాంతం వరకు కొనసాగనుంది. మహిళా సాధికారతకు దర్పణంలాగా నిలిచింది.
ఇదిలా ఉండగా సవాయ్ మాధోపూర్ చేరుకునేందుకు ముందు యాత్ర ఇప్పటి వరకు ఝులావర్ , కోటా జిల్లాలను కవర్ చేసింది. రాబోయే రోజుల్లో దౌసా , అల్వార్ జిల్లాలకు కొనసాగుతుంది. రాజస్థాన్ లో ఇప్పటి వరకు కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర డిసెంబర్ 20 దాకా కొనసాగుతుంది. ఈనెల 21న హర్యానాలో ప్రవేశిస్తుంది.
Also Read : తగ్గేదే లే అంటున్న రాజా పటేరియా