Kerala Governor : ఛాన్స‌ల‌ర్ గా కేర‌ళ గ‌వ‌ర్న‌ర్ తొల‌గింపు

కోలుకోలేని షాక్ ఇచ్చిన కేర‌ళ ప్ర‌భుత్వం

Kerala Governor : కేర‌ళ ప్ర‌భుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఆరిఫ్ మ‌హ్మ‌ద్ ఖాన్ కు(Kerala Governor). రాష్ట్ర విశ్వ విద్యాల‌యాల ఛాన్స‌ల‌ర్ గా గ‌వ‌ర్న‌ర్ ను తొల‌గించే బిల్లును కేర‌ళ శాస‌న స‌భ ఆమోదించింది. గ‌త కొంత కాలంగా సీఎం పిన‌ర‌య్ విజ‌య‌న్ కు గ‌వ‌ర్న‌ర్ ఖాన్ కు మ‌ధ్య ప‌డ‌డం లేదు. ఒక‌రిపై మ‌రొక‌రు మాట‌ల‌తో హోరెత్తించారు.

కేసుల దాకా వెళ్లింది. వీసీల నియామ‌కం చెల్ల‌దంటూ వెంట‌నే రాజీనామా చేయాల‌ని ఆదేశించారు గ‌వ‌ర్న‌ర్. కానీ గ‌వ‌ర్న‌ర్ కు నియ‌మించే అధికారం మాత్ర‌మే ఉంటుంద‌ని కానీ తొల‌గించే ప‌వ‌ర్స్ లేవంటూ స్ప‌ష్టం చేసింది కేర‌ళ స‌ర్కార్.

గ‌వ‌ర్న‌ర్ ను ఛాన్స‌ల‌ర్ గా తొల‌గించ‌డాన్ని తాము వ్య‌తిరేకించడం లేద‌ని, అయితే రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు , కేర‌ళ హైకోర్టు మాజీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తుల నుండి ఆయ‌న‌ను ఎంపిక చేయాల‌ని యుడీఎఫ్ గంట‌ల త‌ర‌బ‌డి చ‌ర్చించారు.

ఆ త‌ర్వాత బిల్లు ఆమోదించారు. రాష్ట్రంలోని విశ్వ విద్యాల‌యాల ఛాన్స‌ల‌ర్ గా గ‌వ‌ర్న‌ర్(Kerala Governor) ను భ‌ర్తీ చేసి, ప్ర‌ముఖ విద్యా వేత్త‌ల‌ను ఉన్న‌త ప‌ద‌విలో నియ‌మించే యూనివ‌ర్సిటీల చ‌ట్టాల (స‌వ‌ర‌ణ ) బిల్లును కేర‌ళ అసెంబ్లీ మంగ‌ళ‌వారం ఏక‌గ్రీవంగా ఆమోదించింది.

కాగా బిల్లుకు సంబంధించి త‌మ సూచ‌న‌ల‌ను ఆమోదించ‌నందుకు ప్ర‌తిప‌క్ష యుడీఎఫ్ స‌భ‌ను బ‌హిష్క‌రించింది. కాగా బిల్లు ఆమోదం పొందింద‌ని స్పీక‌ర్ ఏఎన్ శ్యాంసీర్ వెల్ల‌డించారు. ప్ర‌తి యూనివ‌ర్శిటీకి వేర్వేరు ఛాన్స‌ల‌ర్లు ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ని , సెల‌క్ష‌న్ ప్యానెల్ లో సీఎం, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, కేర‌ళ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ ఉండాల‌ని కూడా ప్ర‌తిప‌క్షం పేర్కొంది.

Also Read : స‌రిహ‌ద్దు వివాదంపై బొమ్మై కామెంట్

Leave A Reply

Your Email Id will not be published!