Revanth Reddy : పోలీసుల దౌర్జ‌న్యం డేటా చౌర్యం – రేవంత్

సిబ్బందిని ఎత్తుక పోయిండ్రు

Revanth Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌మ పార్టీకి సంబంధించిన సోష‌ల్ మీడియా వంగ్ ఆఫీసులో దాడులు చేయ‌డాన్ని తీవ్రంగా ఖండించారు. బుధ‌వారం రేవంత్ రెడ్డి(Revanth Reddy) మీడియాతో మాట్లాడారు. ప్ర‌జాస్వామిక వ్య‌వ‌స్థ‌ల‌ను ధ్వంసం చేస్తూ వస్తున్నార‌ని ఇందుకు పీఎం మోదీ, సీఎం కేసీఆర్ బాధ్య‌త వ‌హించాల‌ని అన్నారు.

హైద‌రాబాద్ క‌మిష‌న‌ర్ చ‌ట్టాన్ని పాటించ‌డం లేద‌ని ఆరోపించారు. డీజీపీ ఫోన్ చేస్తే ప‌ల‌క‌డం లేద‌న్నారు. త‌మ సీనియ‌ర్ నాయ‌కుడు జానా రెడ్డి ఫోన్ చేస్తే త‌న‌కు తెలియ‌ద‌న్నారు. ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండా దాడులు జ‌ర‌పడంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విలువైన స‌మాచారాన్ని, త‌మ వార్ రూమ్ సిబ్బందిని తీసుకు వెళ్లార‌ని ఆరోపించారు.

సీఎం కేసీఆర్ అధికారం కోసం కుట్ర‌లు, కుతంత్రాల‌కు పాల్ప‌డుతున్నారంటూ ఫైర్ అయ్యారు. వార్ రూమ్ లోని 50 కంప్యూట‌ర్లు, ల్యాప్ టాప్ లు ఎత్తుకు వెళ్లార‌ని సీరియ‌స్ అయ్యారు రేవంత్ రెడ్డి. ఇప్ప‌టికే మాజీ మంత్రి ష‌బ్బీర్ అలీ, మాజీ ఎంపీ మ‌ల్లు ర‌వి, మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్ తో స‌హా ప‌లువురు నేత‌లు ప్ర‌శ్నించారు.

ఇదే స‌మ‌యంలో హైద‌రాబాద్ పోలీసులు సునీల్ క‌నుగోలు ను అరెస్ట్ చేయ‌డానికి రావ‌డం దారుణ‌మ‌న్నారు. ఫేస్ బుక్ లో పోస్ట్ పెడితే ఎందుకు అభ్యంత‌రం ఉండాలో పోలీసుల‌కే తెలియాల‌ని అన్నారు మాజీ పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. వార్ రూమ్ సిబ్బందిని దౌర్జ‌న్యంగా రౌడీ మూక‌లు లాగా పోలీస్ వాహ‌నాల్లో తీసుకు వెళ్లార‌ని ఆరోపించారు రేవంత్ రెడ్డి(Revanth Reddy).

ఇప్ప‌టి వ‌ర‌కు వారిని ఎక్క‌డ దాచారో తెలియ‌డం లేద‌న్నారు. పోలీసు ఉన్న‌తాధికారుల‌కు ఫోన్లు చేసినా స్పందించ‌డం లేద‌న్నారు.

Also Read : పోలీసు దాడులు దారుణం – కాంగ్రెస్

Leave A Reply

Your Email Id will not be published!