KTR : ఏడాదిన్న‌ర‌లో ల‌క్ష‌న్న‌ర కొలువులు – కేటీఆర్

హైద‌రాబాద్ న‌గ‌రంలో జాబ్స్ నియ‌మించాం

KTR : గ‌త ఏడాదిన్న‌ర కాలంలో ఒక్క హైద‌రాబాద్ న‌గ‌రంలో టాప్ కంపెనీల‌లో ల‌క్ష‌న్న‌ర జాబ్స్ నియ‌మించ‌డం జ‌రిగింద‌న్నారు రాష్ట్ర ఐటీ, పుర‌పాలిక శాఖ మంత్రి కేటీఆర్. బుధ‌వారం వ‌ర‌ల్డ్ లోనే టాప్ కంపెనీగా పేరొందిన బోష్ కంపెనీకి చెందిన స్మార్ట్ క్యాంప‌స్ ను ప్రారంభించారు.

ఒక‌ప్పుడు ఐటీ , లాజిస్టిక్ అంటే బెంగళూరు కేరాఫ్ గా ఉండేద‌ని కానీ తెలంగాణ రాష్ట్ర స‌మితి ప్ర‌భుత్వం ఏర్పాటు అయ్యాక సీన్ మారింద‌న్నారు. ప్ర‌స్తుతం దేశానికి హైద‌రాబాద్ కేంద్రంగా నిలిచింద‌న్నారు. మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించ‌డంలో తాము టాప్ లో ఉన్నామ‌ని చెప్పారు.

న‌గ‌రం గ‌తంలో నిరాద‌ర‌ణ‌కు లోనైంద‌ని కానీ తాము ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక అద్దం లాగా చేశామ‌ని అన్నారు కేటీఆర్(KTR). తెలంగాణ అభివృద్దిలో టాప్ లో ఉంద‌న్నారు. భాగ్య‌న‌గ‌రం అభివృద్దికి సీఎం కేసీఆర్ ఫోక‌స్ పెట్టార‌ని అందులో భాగంగానే ప్ర‌పంచంలోని టాప్ కంపెనీలు క్యూ క‌డుతున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు కేటీఆర్.

ఓ వైపు ప్ర‌భుత్వ ఉద్యోగాల‌తో పాటు ప్రైవేట్ సెక్టార్ ల‌లో కూడా ఉద్యోగాలు నియ‌మించ‌డం జ‌రుగుతోంద‌న్నారు మంత్రి. ఒక్క దేశంలో నియామ‌కం జ‌రిగిన జాబ్స్ ల‌లో అత్య‌ధిక శాతం కేవ‌లం హైద‌రాబాద్ లో కొలువు తీర‌డం జ‌రిగింద‌న్నారు. బోష్ ఇప్ప‌టికే అతి పెద్ద కంపెనీగా పేరు పొందింద‌న్నారు కేటీఆర్.

ఆటోమోటివ్ రంగంలో బోష్ టాప్ లో కొన‌సాగుతోంద‌న్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. క్వాల్ కామ్ లాంటి సెమీ కండ‌క్ట‌ర్ కంపెనీలు కూడా కొలువు తీరాయ‌ని పేర్కొన్నారు. అంతే కాకుండా త్వ‌ర‌లో హైద‌రాబాద్ లో ఫార్ములా – ఈను నిర్వ‌హిస్తామ‌న్నారు కేటీఆర్.

Also Read : టాటా క‌ల‌ల కారు మ‌ళ్లీ మార్కెట్ లోకి

Leave A Reply

Your Email Id will not be published!