CM KCR BRS Office : భార‌త రాష్ట్ర స‌మితి ఆఫీసు ప్రారంభం

హాజ‌రైన మాజీ సీఎంలు..రైతు నేత‌లు

CM KCR BRS Office : దేశ రాజ‌కీయాల‌లో కీల‌క‌మైన మార్పుకు శ్రీ‌కారం చుట్టారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్. బుధ‌వారం దేశ రాజ‌ధానిలో ఏర్పాటు చేసిన భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ కార్యాల‌యాన్ని బుధ‌వారం ఆయ‌న చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి దేశంలోని ప్ర‌ముఖ నాయ‌కులు, వివిధ రంగాల‌కు చెందిన వారు హాజ‌ర‌య్యారు.

మాజీ సీఎంలు కుమార స్వామి, అఖిలేష్ యాద‌వ్ సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు. పార్టీని ప్రారంభించిన కేసీఆర్ అనంత‌రం బీఆర్ఎస్ జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. ఆఫీసులో సీఎం(CM KCR BRS Office)  ఆసీనుల‌య్యారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ కు హాజ‌రైన నేత‌లు, ప్ర‌ముఖులు అభినంద‌న‌లు తెలిపారు.

పార్టీ ఆఫీసు కంటే ముందు రాజ శ్యామ‌ల యాగం పూర్ణాహుతి కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మానికి సీఎం దంప‌తులు హాజ‌ర‌య్యారు. వేద పండితులు ఆశీర్వ‌చ‌నాలు అంద‌జేశారు. గ‌తంలో తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం తెలంగాణ ఉద్య‌మాన్ని న‌డిపించారు. అనంత‌రం తెలంగాణ పేరుతో అస్తిత్వానికి ఒక చిహ్నంగా ఉండేలా చేశారు.

త‌న కల రాష్ట్రం సాధించ‌డ‌మేన‌ని ప్ర‌క‌టించారు. ఆచ‌ర‌ణ‌లో చేసి చూపించారు. కేసీఆర్ సార‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర స‌మితి ఏర్పాటైంది. రెండో సారి రాష్ట్రంలో టీఆర్ఎస్ స‌ర్కార్ కొలువు తీరింది. ప్ర‌స్తుతం దేశ రాజ‌కీయాల‌లో ప్ర‌త్యామ్నాయం అవ‌స‌ర‌మ‌ని భావించారు కేసీఆర్.

ఇందుకు సంబంధించి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. ఇటీవ‌లే కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఓకే చెప్పింది. దీంతో కార్య‌రంగంలోకి దూకారు కేసీఆర్. బీఆర్ఎస్ ఒక్క‌టే బీజేపీకి ప్ర‌త్యామ్నాయం అవుతుంద‌ని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు కేసీఆర్.

Also Read : ఏడాదిన్న‌ర‌లో ల‌క్ష‌న్న‌ర కొలువులు – కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!