PM Modi : గుజ‌రాత్ విజ‌యం మ‌న‌కు పాఠం – మోదీ

ఆ రాష్ట్ర పార్టీ చీఫ్ సీఆర్ పాటిల్ కు కితాబు

PM Modi : దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. తాజాగా గుజ‌రాత్ రాష్ట్రంలో జ‌రిగిన శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో 182 స్థానాల‌కు గాను బీజేపీ 156 స్థానాలు కైవ‌సం చేసుకుంది.

రాష్ట్ర చ‌రిత్ర‌లో అత్య‌ధిక స్థానాలు సాధించిన పార్టీగా రికార్డు నెల‌కొల్పింది. సార‌థ్య బాధ్య‌త‌ల‌ను కేంద్ర మంత్రి అమిత్ షా తీసుకుంటే, మొత్తం వ్య‌వ‌హారాన్ని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ సీఆర్ పాటిల్ త‌న మీద వేసుకున్నారు. అంతా తానై వ్య‌వ‌హ‌రించారు. ఈ సంద‌ర్బంగా ఢిల్లీలో జ‌రిగిన పార్టీ కీల‌క స‌మావేశంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi)  ప్ర‌సంగించారు.

గుజ‌రాత్ లో బీజేపీ సాధించిన విజ‌యం అద్భుత‌మ‌న్నారు. కీల‌క పాత్ర పోషించిన పార్టీ నాయ‌క‌త్వాన్ని ప్ర‌శంసల‌తో ముంచెత్తారు. అక్క‌డ అనుస‌రించిన విధానాల‌ను, వ్యూహాల‌ను రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌లో అమ‌లు చేసేందుకు దోహ‌దం చేస్తాయ‌ని చెప్పారు న‌రేంద్ర మోదీ.

తాను అత్య‌ధిక సార్లు ప‌ర్య‌టించినా కేంద్ర , రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలను ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్ల‌డంలో రాష్ట్ర నాయ‌క‌త్వం స‌క్సెస్ అయ్యింద‌న్నారు పీఎం. పార్టీ పార్ల‌మెంట‌రీ స‌మావేశంలో స‌భ్యులు ప్ర‌ధాన‌మంత్రిని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు.

మీ వ‌ల్ల‌నే ఈ ఘ‌న విజ‌యం సాధ్య‌మైంద‌న్నారు. కానీ న‌రేంద్ర మోదీ(PM Modi)  ఒప్పుకోలేదు. ఈ క్రెడిట్ అంతా పార్టీ నాయ‌క‌త్వానికి, ప్ర‌ధానంగా సీఆర్ పాటిల్ కు ద‌క్కుతుంద‌న్నారు. బూత్ లెవ‌ల్లో పార్టీని బ‌లోపేతం చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించార‌ని , ఇదే స‌మ‌యంలో జేపీ న‌డ్డా కూడా ప్ర‌య‌త్నం చేశారంటూ పేర్కొన్నారు మోదీ.

Also Read : మోదీ మౌనం దేనికి సంకేతం – ముఫ్తీ

Leave A Reply

Your Email Id will not be published!