Modi PM : స్వామి మ‌హ‌రాజ్ సేవ‌లు ప్ర‌శంస‌నీయం

మానవీయ విలువ‌ల‌కు పెద్ద పీట వేశారు

Modi PM : స్వామి మ‌హ‌రాజ్ బోధించిన మాన‌వీయ విలువ‌లు ఆచ‌ర‌ణీయ‌మ‌ని పేర్కొన్నారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ లో స్వామి మ‌హ‌రాజ్ శ‌తాబ్ది మహోత్స‌వ్ కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా స్వామి మ‌హ‌రాజ్ విగ్ర‌హానికి నివాళులు అర్పించారు ప్ర‌ధాన‌మంత్రి.

అనంత‌రం ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో న‌రేంద్ర మోదీ(Modi PM) ప్ర‌సంగించారు. ఎంత పెద్ద సంక్షోభం వ‌చ్చినా , ఎంత పెద్ద విప‌త్తు సంభ‌వించినా మ‌నం ఎదుర్కొనే ధైర్యాన్ని క‌లిగి ఉన్నామ‌న్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం స్వామిజీ బోధ‌న‌లేన‌ని స్ప‌ష్టం చేశారు. అక్ష‌ర ధామ్ పై ఉగ్ర‌వాదులు దాడి జ‌రిగిన‌ప్పుడు తాను స్వామీజికి ఫోన్ చేశాన‌ని, ఆయ‌న మాట‌లు విని తాను ఆశ్చ‌ర్యానికి లోనైన‌ట్లు చెప్పారు ప్ర‌ధాన‌మంత్రి.

ఈ దేశంలో ఎంద‌రో మ‌హానుభావులు పుట్టార‌ని, వారంద‌రి సేవ‌లు, ఆధ్యాత్మిక బోధ‌న‌ల వ‌ల్ల‌నే ఇవాళ మ‌నం ప్ర‌శాంతంగా జీవ‌నం సాగిస్తున్నామ‌ని అన్నారు. దేశ ర‌క్ష‌ణ‌లో జ‌వాన్లు కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్నార‌ని ప్ర‌శంస‌లు కురిపించారు. వాళ్లు లేక పోతే దేశం లేద‌న్నారు.

ఇదే స‌మ‌యంలో దేశాన్ని ఒక‌టిగా ఉంచేలా చేయ‌డంలో స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ చేసిన కృషి అద్భుత‌మ‌న్నారు. ఆయ‌న పుణ్య తిథిని పుర‌స్క‌రించుకుని నివాళులు అర్పిస్తున్న‌ట్లు పేర్కొన్నారు ప్ర‌ధాన‌మంత్రి. భార‌త దేశాన్ని ఏకం చేయ‌డంలో , స‌ర్వ‌తో ముఖాభివృద్దికి తోడ్పాటు అందించ‌డంలో ఆయ‌న చేసిన కృషి అసమాన్య‌మ‌న్నారు న‌రేంద్ర మోదీ(Modi PM).

ప్ర‌పంచం ఉన్నంత దాకా స‌ర్దార్ ప‌టేల్ ప్ర‌భ వెలుగుతూనే ఉంటుంద‌న్నారు. ఆధ్యాత్మికత వెల్లి విరియ‌డం వ‌ల్ల‌నే అఖండ భార‌తం కొన‌సాగుతోంద‌న్నారు.

Also Read : గుజ‌రాత్ విజ‌యం మ‌న‌కు పాఠం – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!