Rahul Gandhi : మోదీ మౌనం చైనా యుద్ధానికి సిద్దం

నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ

Rahul Gandhi : కాంగ్రెస్ అగ్ర నేత‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఓ వైపు చైనా దేశం భార‌త దేశంపైకి యుద్దానికి సిద్దమ‌వుతుంటే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ మాత్రం నిద్ర పోతున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ఈ సమ‌యంలో అల‌ర్ట్ ఉండాల్సిన ప్ర‌ధాని ఎలా మౌనంగా ఉంటారంటూ ప్ర‌శ్నించారు. గ‌త వారం అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లోని వాస్త‌వ నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద య‌థాత‌థ స్థితిని ఏక‌ప‌క్షంగా మార్చేందుకు చైనా ప్ర‌య‌త్నం చేసిందంటూ ప్ర‌భుత్వం పేర్కొన‌డం సిగ్గు చేటు అని మండిప‌డ్డారు.

రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర రాజ‌స్థాన్ లో కొన‌సాగుతోంది. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం రాజ‌స్థాన్ లోని దౌసాలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. చైనా నుండి ముప్పు పొంచి ఉన్నా ఎందుక‌ని బాధ్య‌తా రాహిత్యంగా వ్య‌వ‌హ‌రిస్తోందంటూ నిల‌దీశారు.

మోదీ పాల‌న గాడి త‌ప్పింద‌ని , అది కేవ‌లం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారింద‌ని మండిప‌డ్డారు. చైనా యుద్దానికి సిద్ద‌మ‌వుతోంది. కానీ భార‌త్ మాత్రం చొర‌బాటు అంటూ అబ‌ద్దాలు చెబుతోంద‌న్నారు.

వారి ఆయుధాల స‌రళి ఒక్క‌సారి చూస్తే అర్థ‌మ‌వుతుంద‌న్నారు. కానీ మ‌న స‌ర్కార్ దానిని అంగీక‌రించేందుకు ఒప్పుకోవ‌డం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతే కాదు భార‌త దేశ విదేశాంగ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్ పై నిప్పులు చెరిగారు రాహుల్ గాంధీ(Rahul Gandhi) .

ఓ వైపు దాడికి గుర‌వుతుంటే శాంతి వ‌చ‌నాలు వ‌ల్లించ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Also Read : దేశంలో అస‌లు ‘ప‌ప్పు’ ఎవ‌రు

Leave A Reply

Your Email Id will not be published!