Narendra Singh Tomar : రైతుల సమస్యపై కాంగ్రెస్ రాజకీయం
కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్
Narendra Singh Tomar : రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందంటూ ఆరోపించారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్ర నరేంద్ర సింగ్ తోమర్. ఇదిలా ఉండగా పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈరోజు వరకు వ్యవసాయ బిల్లును రద్దు చేసిన ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రైతుల ఆందోళన సందర్భంగా నమోదు చేసిన కేసులను ఎత్తి వేయలేదని , చని పోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించ లేదని ఆరోపించారు. కేంద్ర సర్కార్ పూర్తిగా వ్యాపారవేత్తలకు ఊడిగం చేస్తోందంటూ మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీలు.
దీంతో జోక్యం చేసుకున్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నిప్పులు చెరిగారు. తాము రైతులకు చేయాల్సిందంతా చేశామన్నారు. వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలను అవలంభిస్తోందంటూ ఆరోపించారు నరేంద్ర సింగ్ తోమర్(Narendra Singh Tomar).
కాగా గత ఏడాది రైతుల ఆందోళన ముగించిన తర్వాత రైతులకు కనీస మద్దతు ధర హామీ ఇస్తానని చెప్పిన సర్కార్ ఎందుకు ఆలస్యం చేస్తోందంటూ కాంగ్రెస్ నాయకుడు దీపేందర్ సింగ్ హూడా ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇస్తూ తోమర్ ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కమిటీ దీనిని పరిశీలిస్తోందన్నారు.
అయితే రద్దు చేసిన సాగు చట్టాలను తయారు చేసిన కార్యదర్శి ప్రస్తుతం బహుళజాతి కంపెనీతో కలిసి పని చేస్తున్నారని హూడా నిప్పులు చెరిగారు. చట్టాలను రూపొందించడంలో అతడి పాత్ర ఏమిటని ప్రశ్నించారు.
Also Read : భిన్నాభిప్రాయాలతో సమస్య లేదు – రాహుల్