US Welcomes : ప్రధాని మోదీ వైఖరి ప్రశంసనీయం – యుఎస్
ఉక్రెయిన్ పై దాడులు ఆపాలని కోరిన పీఎం
US Welcomes : ఉక్రెయిన్ పై మరోసారి రష్యా రెచ్చి పోయింది. దేశ రాజధాని కైవ్ పై మిస్సైళ్లతో విరుచుకు పడింది. భారీ ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే రష్యా దేశ అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ కు ఫోన్ చేశారు. ఏకపక్ష దాడులు ఆపాలని కోరారు.
ఇప్పటికే తమ దేశం స్నేహాన్ని కోరుకుంటున్నా కానీ యుద్దాన్ని స్వాగతించడం లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా పుతిన్ కు మోదీ ఫోన్ చేసిన కొన్ని గంటల తర్వాత అమెరికా ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు నరేంద్ర దామోదర దాస్ మోదీ నిర్ణయాన్ని స్వాగతించింది.
ప్రధానమంత్రి తీసుకున్న చొరవను తాము అభినందిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి కీలక ప్రకటన చేశారు. అన్ని రకాల హింసను విరమించు కోవాలని మరోసారి అమెరికా(US Welcomes) రష్యాకు విన్నవించింది. కేవలం దౌత్య మార్గాన్ని అనుసరించాలని, అదే అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని అభిప్రాయ పడింది.
ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటున్న చొరవను తాము పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న తరుణంలో యుద్ద ప్రభావాలను తగ్గించు కోవాల్సిన అవసరం ఉందన్నారు విదేశాంగ శాఖ ప్రిన్సిపల్ డిప్యూటీ స్పోక్స్ పర్సన్ వేదాంత్ పటేల్ అన్నారు.
ఆయన అమెరికా మీడియాతో మాట్లాడారు. తాము సైతం యుద్దాన్ని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. రష్యాతో యుద్దాన్ని విరమింప చేసేందుకు ప్రధాన మంత్రి మరింత చొరవ తీసుకోవాలని వేదాంత్ పటేల్ కోరారు.
Also Read : ఉక్రెయిన్ పై రెచ్చి పోయిన రష్యా