Tejasvi Surya : భుట్టో..భారత్ తో పెట్టుకుంటే జాగ్రత్త – సూర్య
దేశమంతటా దిష్టి బొమ్మ దహనం
Tejasvi Surya : బిన్ లాడెన్ చని పోయాడు. కానీ గుజరాత్ కసాయి ఇంకా బతికే ఉన్నాడంటూ పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి బిలావర్ భుట్టో జర్దారీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి సీరియస్ కామెంట్స్ చేశారు. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఒక రకంగా నిప్పులు చెరిగింది.
ఇంకోసారి నోరు జారితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇదిలా ఉండగా ఇవాళ దేశ వ్యాప్తంగా బిలావర్ భుట్టో జర్దారీ చేసిన కామెంట్స్ కు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతోంది. ఇందులో భాగంగా భుట్టో దిష్టి బొమ్మను దగ్ధం చేయనుంది.
కాగా ఆయన చేసిన కామెంట్స్ కు నిరసన తెలియ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీలో పాకిస్తాన్ హై కమిషన్ ముందు ఆందోళన చేపట్టారు. భుట్టో వెంటనే క్షమాపణలు చెప్పాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య.
శనివారం దేశమంతటా నిరసనలతో హోరెత్తిస్తామని ప్రకటించారు. పాకిస్తాన్ కు ఇంకా బుద్ది రాలేదన్నారు సూర్య. తమతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తలు పాకిస్తాన్ , పాక్ విదేశాంగ శాఖ మంత్రి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఆయన చర్యను ఖండిస్తున్నట్లు ప్రకటించారు.
జర్దారీ చేసిన వ్యాఖ్యలను అత్యంత అవమానకరమైనదిగా, పిరికితనంతో నిండినదిగా పేర్కొన్నారు ఎంపీ తేజస్వి సూర్య(Tejasvi Surya). ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పతనావస్థ స్థితిలో ఉందని దాని నుంచి దృష్టి మరల్చేందుకు భుట్టో ఇలాంటి చౌకబారు కామెంట్స్ చేశారంటూ ఆరోపించారు.
Also Read : మోదీపై కామెంట్స్ బిలావర్ కు వార్నింగ్