PM Modi : త్రిపుర, మేఘాలయలో మోదీ టూర్
రూ. 6,800 ప్రాజెక్టులకు శ్రీకారం
PM Modi : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం త్రిపుర, మేఘాలయలలో పర్యటించనున్నారు. రూ. 6,800 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఈశాన్య మండలి స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. షిల్లాంగ్ జరిగే సమావేశంలో పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది.
హౌసింగ్ , రోడ్ , వ్యవసాయం, టెలికాం, ఐటీ, టూరిజం , హాస్పిటాలిటీ వంటి అనేక రంగాలను ఈ ప్రాజెక్టులు కలిగి ఉన్నాయని వెల్లడించింది. అగర్తలాలో, ప్రధానమంత్రి(PM Modi) ఆవాస్ యోజన , అర్బన్ , రూరల్ పథకాల కింద రెండు లక్షల మందికి పైగా లబ్దిదారుల కోసం గృహ ప్రవేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ (ఎన్ఈసీ) అధికారికంగా నవంబర్ 7, 1972లో ప్రారంభించబడింది. వివిధ మౌలిక సదుపాయాల ప్రాజజెక్టులు , అభివృద్ది కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం ద్వారా సామాజిక, ఆర్థిక అభివృద్దిలో కీలక పాత్ర పోషించిందని పీఎంఓ వెల్లడించింది.
ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, క్రీడలు, జల వనరులు, వ్యవసాయం, పర్యాటకం, పరిశ్రమలతో సహా రంగాలలోని కీలకమైన గ్యాప్ ప్రాంతాలలో విలువైన మూల ధనం , సామాజిక మౌలిక సదుపాయాలను రూపొందించడంలో ఇది సహాయ పడిందని తెలిపింది.
ఇందులో భాగంగా రూ. 2,450 కోట్ల విలువైన బహుళ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఈ ప్రాంతంలో టెలికాం కనెక్టివిటీని మరింత పెంచేందుకు ఒక దశలో 4జీ మొబైల్ టవర్ లను దేశానికి అంకితం చేస్తారని తెలిపింది.
వీటిలో ఇప్పటి వరకు 320కి పైగా పూర్తయ్యాయి. దాదాపు ఇంకా 890 నిర్మాణంలో ఉన్నాయని పేర్కొంది పీఎంఓ. ఉమ్సావ్లీలో ఐఐఎం షిల్లాంగ్ లో కొత్త క్యాంపస్ ను కూడా పీఎం నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
Also Read : ప్యూర్..నిర్మాణ్ ‘రైజ్’ ప్రాజెక్టుకు శ్రీకారం