Youtubers Record : యూట్యూబ్ ఊతం క్రియేట‌ర్ల‌కు స్వ‌ర్గధామం

2021లో భారీగా వెన‌కేసుకున్న వైనం

Youtubers Record : గూగుల్ ఎప్పుడైతే ప్ర‌పంచంలోకి వ‌చ్చిందో ఆనాటి నుంచి అన్నీ మారి పోయాయి. ఈ ఐటీ దిగ్గ‌జం ఏది చేసినా ఓ సంచ‌ల‌న‌మే. ప్ర‌ధానంగా ఏ స‌మాచారం కావాల‌న్నా సెకండ్ల‌లో మ‌న క‌ళ్ల ముందు ఆవిష్క‌రిస్తుంది. ఎల్ల‌ప్పుడూ క్రియేటివిటీకి పెద్ద పీట వేస్తూ క్రియేట‌ర్ల‌కు స్వాగ‌తం ప‌లుకుతోంది.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్క‌డ చిన్న అంశ‌మైనా త‌మ‌కు లేదా స‌మాజానికి ఉప‌యోగ ప‌డుతుంద‌ని తెలిస్తే చాలు గూగుల్ గుర్తిస్తుంది. దానికి సంపూర్ణ మ‌ద్ద‌తు తెలుపుతుంది. అంతేనా ఎంతైనా స‌రే కొనుగోలు చేస్తుంది. ఏది కావాల‌న్నా ఇప్పుడు గూగుల్ మీద ఆధార‌ప‌డ‌టం అల‌వాటుగా మారింది.

ఇదే లైఫ్ ను ఛేంజ్ అయ్యేలా చేస్తోంది. ఇందులో భాగంగా గూగుల్ కు చెందిన మ‌రో అద్భుతం యూట్యూబ్. ఇది వ‌చ్చాక సీన్ మారింది. సిట్యూయేష‌న్ కూడా మారి పోయింది. కోట్లాది వీడియోలు నిత్యం అప్ లోడ్ అవుతూ ఉంటాయి. ఇక యూట్యూబ‌ర్ల‌కు, క్రియేట‌ర్ల‌కు యూట్యూబ్ ఓ వేదిక‌గా, స్వ‌ర్గధామంగా మారి పోయింది.

చిన్నారుల నుంచి పెద్ద‌ల దాకా, కుల మ‌తాల‌కు అతీతంగా సెన్సేష‌న్ గా మారి పోతున్నారు. అన్ని రంగాల‌కు చెందిన వారు యూట్యూబ్ లో ప్ర‌త్య‌క్షం అవుతున్నారు. త‌మ‌ను తాము చూసుకుంటున్నారు. అంతే కాదు త‌మ‌ను తాము ఆవిష్క‌రించుకుంటున్నారు.

త‌మ‌లోని టాలెంట్ ను బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ చేస్తున్నారు. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా ల‌క్ష‌లు, కోట్లు సంపాదిస్తున్నారు. ఇదే విష‌యాన్ని గూగుల్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. గ‌త 2021 ఏడాదిలో ఏకంగా భార‌త దేశానికి చెందిన క్రియేట‌ర్లు ఏకంగా రూ. 10 వేల కోట్ల‌కు పైగా సంపాదించార‌ని వెల్ల‌డించింది(Youtubers Record) . ఇది విస్తు పోయే వార్త‌. వీరంతా కంటెంట్ క్రియేట‌ర్లు కావ‌డం విశేషం.

Also Read : డిజిట‌ల్ ప‌రివ‌ర్త‌నపై భారత్ ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!