Elon Musk Step Down : త్వరలో సిఇఓ నుంచి తప్పుకుంటా
స్పష్టం చేసిన టెస్లా సిఇఓ, ట్విట్టర్ బాస్
Elon Musk Step Down : ప్రపంచ కుబేరుడిగా పేరొందిన టెస్లా చైర్మన్ , ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన చేశారు. ఆయన రూ. 44,300 కోట్లకు ట్విట్టర్ ను టేకోవర్ చేసుకున్నారు. కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. 9 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించాడు. సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
నిత్యం వార్తల్లో నిలిచారు. టాప్ ఎగ్జిక్యూటివ్ లను సాగ నంపాడు. ఇందులో సిఇఓ, సీఎఫ్ఓ, లీగల్ హెడ్ ను తొలగించాడు. ఈ తరుణంలో ట్విట్టర్ వేదికగా ఓ పోల్ నిర్వహించాడు. అదేమిటంటే తాను ట్విట్టర్ కు సిఇఓగా ఉండాలా వద్దా అని. ఈ పోల్ లో ఊహించని రీతిలో ఆశించిన మేర ఎలాన్ మస్క్ కు ఓట్లు రాలేదు.
ఈ మేరకు తాను ప్రకటించిన విధంగానే సరైన, సమర్థవంతమైన వ్యక్తి సిఇఓగా దొరికితే తాను వైదొలిగేందుకు సిద్దంగా ఉన్నానని వెల్లడించారు. ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అయితే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మస్క్(Elon Musk). ఈ ఉద్యోగాన్ని తీసుకునేంత తెలివి తక్కువ వ్యక్తిని గుర్తించిన వెంటనే తాను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టును వదులుకుంటానని సెటైర్ వేశారు.
నేను ఉద్యోగంలో చేరేంత మూర్ఖుడు అనిపించిన వెంటనే తాను తన పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు ఎలాన్ మస్క్. ఆ తర్వాత సాఫ్ట్ వేర్ , సర్వర్ల బృందాలను నడుపుతానంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
తాను చేపట్టిన పోల్ లో ఆశించిన మేర స్పందన రాలేదు. తాను కోరిన వ్యక్తి లభిస్తే వైదొలిగేందుకు సిద్దంగా ఉన్నానని మరోసారి కుండ బద్దలు కొట్టారు ఎలాన్ మస్క్.
Also Read : యూట్యూబ్ ఊతం క్రియేటర్లకు స్వర్గధామం