MLC Kavitha : తార‌లు ఎన్ని ఉన్నా చంద్రుడు ఒక్క‌డే

ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత బాబుపై కామెంట్

MLC Kavitha : ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆకాశంలో తార‌లు ఎన్ని ఉన్నా చంద్రుడు ఒక్క‌డేన‌ని ..అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎంత మంది రాజ‌కీయ నాయ‌కులు ఉన్నా కేసీఆర్ (క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు) ఒక్క‌డేన‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా త్వ‌ర‌లో ఎన్నిక‌లు రానుండ‌డంతో తెలంగాణ‌లో రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కాయి.

టీఆర్ఎస్ కొట్టిన దెబ్బ‌కు అడ్ర‌స్ లేకుండా పోయిందిన తెలుగుదేశం పార్టీ ఉన్న‌ట్టుండి మెల మెల్ల‌గా ఉనికిని చాటుకునేందుకు య‌త్నిస్తోంది. ఇప్ప‌టికే టీడీపీ స్టేట్ ప్రెసిడెంట్ గా కాసాని జ్ఞానేశ్వ‌ర్ ను నియ‌మించారు ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, మాజీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు(N Chandrababu Naidu).

అంతే కాదు ఖ‌మ్మంలో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించారు డిసెంబ‌ర్ 21న . ఈ స‌భ‌కు ఊహించ‌ని రీతిలో పెద్ద ఎత్తున జ‌నం హాజ‌ర‌య్యారు. దీంతో ప‌సుపు ప‌చ్చ ద‌ళంలో మ‌రింత సంతోషం, ఉత్సాహం వెల్లి విరిసింది. తాము రాబోయే ఎన్నిక‌ల్లో స‌త్తా చాటుతామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు నారా చంద్ర‌బాబు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌సంగిస్తూ తాను లేక పోతే హైద‌రాబాద్ ఇలా ఉండేది కాద‌న్నారు. త‌న వ‌ల్ల‌నే న‌గ‌రం అభివృద్ది చెందింద‌న్నారు. మైక్రో సాఫ్ట్ ఇక్క‌డికి వ‌చ్చింద‌ని, తాను ప్ర‌య‌త్నం చేయ‌డం వ‌ల్ల‌నే ఐఎస్బీ ఏర్పాటైంద‌ని, తానే గ‌చ్చి బౌలి స్టేడియంను నిర్మించాన‌ని చెప్పుకున్నారు.

దీనిపై గురువారం ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) సీరియ‌స్ గా స్పందించారు. ఆమె నారా చంద్ర‌బాబు నాయుడిని టార్గెట్ చేశారు. పైగా సెటైర్ వేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. చంద్ర‌బాబు కు అంత సీన్ లేద‌న్నారు. తెలంగాణ‌లో ఆ పార్టీకి పుట్ట‌గ‌తులు ఉండ‌వ‌న్నారు.

Also Read : కాంగ్రెస్ కు డిగ్గీ రాజా చికిత్స‌

Leave A Reply

Your Email Id will not be published!