TSPSC Jobs : కొలువుల భర్తీకి కమిషన్ కసరత్తు
నోటిఫికేషన్లతో సరి భర్తీ ఎక్కడ
TSPSC Jobs : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నోటిఫికేషన్లను జారీ చేసేందుకు పోటీ పడుతోంది. కానీ ఒక్క పోస్టు కూడా ఇప్పటి వరకు భర్తీ చేయలేదు. ఇదంతా ఎన్నికల కోసం చేస్తున్న హడావుడి తప్ప నియమించేందుకు మాత్రం కాదంటున్నారు నిరుద్యోగులు. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదల చేసింది.
గ్రూప్ -1 ప్రిమిలినరీ పూర్తయింది. దానిపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. తాజాగా గ్రూప్ -2 నోటిఫికేషన్(TSPSC Jobs) ఇచ్చేందుకు కమిషన్ కసరత్తు చేస్తోంది. డిసెంబర్ 16న నోటిఫికేషన్ ఇవ్వాలని ముందుగా అనుకున్నారు. కానీ సాంకేతిక కారణాల సాకు చూపి దానిని ఆలస్యం చేశారు.
ఇప్పటి వరకు నిరుద్యోగులకు ఎలాంటి నమ్మకం లేకుండా పోయింది. ఏపీ సర్కార్ ఇప్పటికే ఉద్యోగాల భర్తీకి సంబంధించి జాబ్స్ క్యాలండర్ జారీ చేసింది. వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసింది. భారీ ఎత్తున నియమించేందుకు సీఎం జగన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ఇక్కడ సీఎం మాత్రం బీఆర్ఎస్ పేరుతో కాలయాపన చేయడం తప్ప పోస్టుల భర్తీపై ఫోకస్ పెట్టడం లేదన్న విమర్శలు లేక పోలేదు. ఇదిలా ఉండగా గ్రూప్ -2 నోటిఫికేషన్ ను డిసెంబర్ 27న జారీ చేయనున్నట్లు సమాచారం. మరో వైపు వెటర్నరీ అండ్ అనిమల్ హస్బెండరీ శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ ఏ, బి కేటగిరీలలో 185 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
ఆయా పోస్టుల భర్తీకి సంబంధించి డిసెంబర్ 30 నుంచి దరఖాస్తు చేసుకోవాలని జనవరి 19 ఆఖరు తేదీగా నిర్ణయించినట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది.
Also Read : గ్రూప్ – 4 పోస్టుల భర్తీకి పచ్చ జెండా