Congress Seniors Revanth : రేవంత్ వన్ మ్యాన్ షో చెల్లదు
కాంగ్రెస్ సీనియర్లు కామెంట్స్
Congress Seniors Revanth : తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తనను తాను రక్షించుకునే పనిలో పడింది. ఆ పార్టీకి ఎప్పుడైతే ఎనుముల రేవంత్ రెడ్డి చీఫ్ గా ఎంపికయ్యాడో ఆనాటి నుంచి రగడ స్టార్ట్ అయ్యింది. అది తారా స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఆరోపణల పర్వం కొనసాగుతోంది.
పార్టీ కోసం పని చేస్తున్న వారిని కాదని బయటి నుంచి వచ్చిన వారికి ప్రయారిటీ ఇస్తున్నారంటూ ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగంగానే ఆరోపణలు గుప్పించారు. వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజ నర్సింహ్మ, మధు యాష్కి గౌడ్ , జగ్గా రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, వి. హనుమంతు రావు, తదితర నాయకులు(Congress Seniors) భగ్గుమన్నారు. ఇప్పటికే వారు బహిరంగంగానే తీవ్ర ఆరోపణలు చేశారు.
తమను కావాలని బయటకు పంపించాలని చూస్తున్నాడని, దీనికంతటికీ రేవంత్ రెడ్డి కారణమంటూ నిప్పులు చెరిగారు. పార్టీలో చోటు చేసుకున్న వ్యవహారాన్ని చక్కదిద్దాల్సింది పోయి తాను వన్ మ్యాన్ షో చేస్తున్నాడంటూ ఆరోపించారు. ఇదిలా ఉండగా పార్టీలో చోటు చేసుకున్న అసంతృప్తిని చల్లార్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ కు హైకమాండ్ అప్పగించింది.
దీంతో ఆయన గత రెండు రోజులుగా హైదరాబాద్ లో మకాం వేశారు. పార్టీని చక్కదిద్దే పనిలో పడ్డారు. అసంతృప్త నాయకులతో వరుసగా భేటీ అవుతూ వస్తున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి(Revanth) వల్ల పార్టీకి ఎంతగా నష్టం వాటిల్లిందనే దానిపై ఆధారాలతో సహా డిగ్గీ రాజాకు సీనియర్లు సమర్పించారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.
Also Read : కాంగ్రెస్ లో లొల్లి దిగ్విజయ్ కు తలనొప్పి