India Starts Nasal Vaccines : ఇంట్రా నాస‌ల్ వ్యాక్సిన్ కు ఓకే

ఇంట్రానాస‌ల్ వ్యాక్సిన్ కు ఓకే

India Starts Nasal Vaccines : చైనాలో క‌రోనా జోరందుకుంది. రోజుకు వేలాది మంది క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఇక చైనా దెబ్బ‌కు భార‌త దేశం అప్ర‌మ‌త్త‌మైంది. ఇప్ప‌టికే కేంద్ర స‌ర్కార్ కీల‌క మీటింగ్ చేప‌ట్టింది. ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి క‌రోనా గురించి హెచ్చరించారు. మాస్క్ లు వాడాల‌ని సూచించారు.

ఇక దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఆధ్వ‌ర్యంలో అత్య‌వ‌స‌ర స‌మావేశం ముగిసింది. కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ముందుంది ముస‌ళ్ల పండుగ‌. రానుంది క‌రోనా కాలం. ద‌య‌చేసి ప్ర‌తి ఒక్క‌రు మాస్క్ ధ‌రించాల‌ని, భౌతిక దూరం పాటించాల‌ని, బూస్ట‌ర్ డోస్ వేసుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు న‌రేంద్ర దామోద‌ర్ దాస్ మోదీ.

తాజాగా కేంద్ర స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ముక్కు ద్వారా క‌రోనా నియంత్ర‌ణ‌కు ఉప‌యోగించేందుకు వాడే వ్యాక్సిన్ కు ఆమోదం తెలిపింది. శుక్ర‌వారం నాసికా వ్యాక్సిన్ ల‌ను ప్రారంభించింది. కోవీషీల్డ్ , కోవాక్సిన్ తీసుకున్న వారు నాసికా వ్యాక్సిన్ బూస్ట‌ర్ డోస్ గా తీసుకోవ‌చ్చ‌ని స్ప‌ష్టం చేసింది.

ఇందులో భాగంగా పెద్ద‌ల‌కు బూస్ట‌ర్ డోస్ గా టీకా కార్య‌క్ర‌మంలో భాగంగా ఇంట్రా నాస‌ల్ కోవిడ్ వ్యాక్సిన్(India Starts Nasal Vaccines) ను చేర్చేందుకు ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది. చైనా, ఇత‌ర కొన్ని దేశాల‌లో కేసుల పెరుగుద‌ల మ‌ధ్య చేర్చ‌డం జ‌రిగింది. వ్యాక్సిన్ లో భాగంగా రెండు చుక్క‌లు వేస్తారు.

ఇది పూర్తిగా భార‌త్ లోనే త‌యారు చేశారు. ఇన్ కోవాక్ ని ప‌రిచ‌యం చేసింది. దీనిని భార‌త్ బ‌యో టెక్ త‌యారు చేసింది. ఇదిలా ఉండ‌గా ఈ వ్యాక్సిన్ ప్ర‌స్తుతానికి ప్రైవేట్ సెంట‌ర్ల‌లో మాత్ర‌మే అందుబాటులో ఉంటుంది.

Also Read : క‌రోనాపై ఏపీ స‌ర్కార్ అప్ర‌మ‌త్తం

Leave A Reply

Your Email Id will not be published!