Ruchira Kamboj : ఒంట‌రైనా విలువ‌లు కోల్పోలేదు – రుచిరా

ఐక్య రాజ్య స‌మితిలో భార‌త్ కామెంట్స్

Ruchira Kamboj : ఐక్య రాజ్య స‌మితిలో భార‌త శాశ్వ‌త ప్ర‌తినిధి రుచిరా కాంబోజ్(Ruchira Kamboj) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశం ప్ర‌స్తుతం భ‌ద్ర‌తా మండ‌లికి నాయ‌క‌త్వం వ‌హిస్తోంది. ఈ సంద‌ర్భంగా కీల‌క కామెంట్స్ క‌ల‌కలం రేపాయి. తమ దేశం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంద‌ని, ఒకానొక ద‌శ‌లో మౌనాన్ని ఆశ్ర‌యించింద‌ని అన్నారు. ఇదే స‌మ‌యంలో ఏనాడూ విలువలు కోల్పోలేద‌ని, తాము ఏర్పాటు చేసుకున్న సిద్దాంతాల‌ను దాటుకుని వెళ్ల లేద‌ని స్ప‌ష్టం చేశారు రుచిరా కాంబోజ్.

కానీ ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కొన్నామ‌ని, తాము ఎప్పుడూ యుద్దాన్ని కోరుకోమ‌ని పేర్కొన్నారు. 2021-22 లో కౌన్సిల్ లో ఎన్నుకున్న స‌భ్యునిగా త‌న రెండేళ్ల ప‌ద‌వీ కాలంలో రెండ‌వసారి డిసెంబ‌ర్ 1న యుఎన్ భ‌ద్ర‌తా మండ‌లి కి సంబంధించి నెలవారీ స‌మావేశం నిర్వ‌హించారు. ఇప్ప‌టికే భార‌త్ అధ్య‌క్ష ప‌ద‌విని స్వీక‌రించింది. ఒక ర‌కంగా చెప్పాలంటే భార‌త్ ద‌శ‌ల వారీగా ఉగ్ర‌వాదంపై పోరు కొన‌సాగించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేసింది.

అంతే కాదు పాకిస్తాన్ అన్ని ర‌కాల ఉగ్ర‌వాదాల‌కు కేరాఫ్ గా మారింద‌ని చెప్ప‌డంలో స‌క్సెస్ అయ్యింది. ఇందుకు సంబంధించి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇప్ప‌టికే పాకిస్తాన్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈ సంద‌ర్భంగా రుచిరా కాంబోజ్(Ruchira Kamboj) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. భ‌ద్ర‌తా మండ‌లిలో సంస్క‌ర‌ణ‌లు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు.

భార‌త దేశం ఒంట‌రిగా నిల‌బ‌డాల్సి వ‌చ్చిన సంద‌ర్బాలు చాలా ఉన్నాయ‌ని తెలిపారు. కానీ అది న‌మ్మిన సూత్రాల‌ను వ‌దిలి పెట్ట లేద‌ని అన్నారు రుచిరా కాంబోజ్.

Also Read : ఇంట్రా నాస‌ల్ వ్యాక్సిన్ కు ఓకే

Leave A Reply

Your Email Id will not be published!