MP Raja ED : రూ. 55 కోట్ల విలువైన భూమి నాది కాదు – రాజా
కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీపై డీఎంకే ఎంపీ ఫైర్
MP Raja ED : డిఎంకే ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి ఎ. రాజా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటికే ఆయన బినామీకి చెందిన రూ. 55 కోట్ల విలువైన బినామీ భూమిని తాము అటాచ్ చేసినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రకటించింది. దీనిపై సీరియస్ గా స్పందించారు ఎ. రాజా. కోయంబత్తూర్ లోని 45 ఎకరాల భూమి తనదేనని ఈడీ అభియోగం మోపడం పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఈడీ కావాలని తనను ఇరికించేందుకు ప్రయత్నం చేస్తోందంటూ ఆరోపించారు ఎంపీ ఎ. రాజా(MP Raja ED). విచిత్రం ఏమిటంటే ఆ స్థలం తనకు చెందినది కాదని, ఈ సమయంలో తనపై కేసు ఎలా నమోదు చేస్తారంటూ ప్రశ్నించారు డీఎంకే ఎంపీ. ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి.
ఈ సందర్భంగా శుక్రవారం ఎ. రాజా స్పందించారు. మీడియాతో మాట్లాడారు. మనీ లాండరింగ్ విచారణ లో భాగంగా ఎంపీకి చెందిన బినామీ పేరుతో ఉన్న రూ. 55 కోట్ల విలువైన 45 ఎకరాల స్థలాన్ని అటాచ్ చేసినట్లు ఈడీ ప్రకటించింది. ఈ మేరకు అధికారికంగా ధ్రువీకరించింది కూడా. దీనిపై సీరియస్ గా స్పందించారు ఎ. రాజా.
2004 నుంచి 2007 మధ్య పర్యావరణం, అడవులకు సంబంధించి కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న సమయంలో గురుగ్రామ్ ఆధారిత బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లిస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీకి పర్మిషన్ ఇచ్చినట్లు ఈడీ ఆరోపించింది. ప్రస్తుతం నీలగిరి లోక్ సభ స్థానం నుంచి డీఎంకే ఎంపీగా ఉన్న ఎ. రాజా ఈడీ అభియోగాన్ని తిరస్కరించారు.
Also Read : ఆర్థిక నేరగాళ్లు ‘దొరబాబులు’