Digvijaya Singh : మోదీ నిర్వాకం పెరిగిన పేదరికం
డిగ్గీ రాజా సీరీయస్ కామెంట్స్
Digvijaya Singh : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్. ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎనిమిదేళ్ల భారతీయ జనతా పార్టీ పాలనలో పేదరికం అత్యంత దారుణంగా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతా రాహిత్యమైన పాలన కారణంగా ఈ దుస్థితి దాపురించిందన్నారు.
శుక్రవారం దిగ్విజయ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. ప్రధాన మంత్రికి స్వంత ప్రచారంపై ఉన్నంత శ్రద్ధం దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై ఉండడం లేదన్నారు. ప్రభుత్వ సంస్థలు నిర్వీర్యం చేయడం, బడా వ్యాపారవేత్తలకు సపోర్ట్ గా నిలవడం తప్ప ఆయన చేసింది ఏమీ లేదన్నారు.
ఇప్పటి వరకు నోట్లు రద్దు చేశారు. ఏడాదికి 2 కోట్ల జాబ్స్ భర్తీ చేస్తామన్నారు. కనీసం 10 వేల పోస్టులను భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు. ద్రవ్యోల్బణం పెరిగింది, నిరుద్యోగ తీవ్రత దారుణంగా ఉందన్నారు. అయినా నరేంద్ర మోదీకి సోయి లేకుండా పోయిందని డిగ్గీ రాజా(Digvijaya Singh) ధ్వజమెత్తారు.
ప్రస్తుతం బీజేపీ దాని అనుబంధ సంస్థలు చేస్తున్నది ఒక్కటే దేశంలో హింసను ఎగదోయడం, మనుషుల మధ్య ఘర్షణలు చెలరేగేలా చేయడం తప్ప అని ఎద్దేవా చేశారు. మోదీ ఆర్థిక పాలసీ దేశాన్ని దివాలా తీసేలా చేస్తోందంటూ మండిపడ్డారు దిగ్విజయ్ సింగ్. రాను రాను పేదరికం స్థాయి మరింత పెరుగుతోందన్నారు.
రోజు రోజుకు ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని మోదీ కోల్పోయారని పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్షాల నాయకులను టార్గెట్ చేస్తున్నారంటూ ఆరోపించారు డిగ్గీ రాజా.
Also Read : సోనియా కామెంట్స్ సత్యదూరం