Farooq Abdullah : జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం , నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా(Farooq Abdullah) హాట్ టాపిక్ గా మారారు. ఆయన పార్లమెంట్ భవనంలో ప్రముఖ పేరొందిన హిందీ సినిమాకు సంబంధించిన పాత పాట జీనా యహాన్ మర్నా యహాన్ అనే పాటను స్వయంగా తానే పాడారు. ప్రస్తుతం ఆయన సోషల్ మీడియాలో వైరల్ గా మారారు.
దేశంలో ముస్లింలపై వివక్ష కొనసాగుతోందని, అందుకే విదేశాల్లో ఉద్యోగాలు చేసి అక్కడే ఉండాలని తన పిల్లలకు సూచించినట్లు ఆర్జేడీ నాయకుడు కామెంట్ చేశారు. ఈ వివాదంపై సీరియస్ గా స్పందించారు ఫరుక్ అబ్దుల్లా. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు చివరి రోజు ఇవాళ. పార్లమెంట్ సముదాయంలో హల్ చల్ చేశారు.
ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ప్రముఖ దివంగత గాయకుడు ముఖేష్ పాడిన అద్భుతమైన పాటల్లో ఇది ఒకటి. అందుకే ఆ పాటంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు ఫరుక్ అబ్దుల్లా(Farooq Abdullah). ఇక్కడే పుట్టాం. ఇక్కడే చని పోతాం. ఇంకెక్కడికి వెళ్లగలం చెప్పండి అంటూ ఆయన పాట ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు మాజీ సీఎం.
ఈ పాట మేరా నామ్ జోకర్ మూవీ లోనిది. అప్పట్లో దేశాన్ని ఒక ఊపు ఊపింది. ఇదిలా ఉండగా రాష్ట్రీయ జనతా దళ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అబ్దుల్ బారీ సిద్దిఖీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో ముస్లింలు బతికే పరిస్థితులు లేవన్నారు. దేశ వాతావరణాన్ని హైలెట్ చేసేందుకు నేను ఒకటి చెప్పాలని అనుకుంటున్నట్లు తెలిపారు.
హార్వర్డ్ లో చదువుతున్న కొఉకు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో డిగ్రీ పొందిన కూతురు ఉన్నారు. కనుక్కోమని చెప్పా. విదేశాల్లోనే ఉండండి అక్కడే స్థిరపడాలని సూచించానని అన్నారు. దీనిపై ఫరుక్ అబ్దుల్లా స్పందించడం..పాట పాడడం ఇప్పుడు వైరల్ గా మారింది.
Also Read : రాణా అయ్యూబ్ కు సెనేటర్ సపోర్ట్