Adani Ambani Rahul Gandhi : ఇది అంబానీ..అదానీ సర్కార్
రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్
Adani Ambani Rahul Gandhi : కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధానమంత్రిపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోదీ వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ప్రస్తుతం ద్వేషం మాత్రమే ఆధిపత్యం చెలాయిస్తోందని మండిపడ్డారు. ఈ దేశాన్ని ఏలుతున్నది మోదీ కాదని అంబానీ, అదానీ అని ఎద్దేవా చేశారు.
బీజేపీ సంకీర్ణ సర్కార్ కాదని ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ జోడో యాత్ర ఢిల్లీకి చేరుకున్న సందర్భంగా రెడ్ ఫోర్ట్ వేదికగా జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ దేశంలో 24 గంటలు హిందువులు, ముస్లింలంటూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ ఆరోపించారు రాహుల్ గాంధీ.
ప్రజలు సమస్యలను ప్రస్తావించకుండా మతంపై ఫోకస్ పెడుతున్నారంటూ మండిపడ్డారు. దేశానికి చెందిన పోర్టులు, ఎయిర్ పోర్టులు, రోడ్లు, ఇతర ప్రభుత్వ ఆస్తులన్నింటినీ ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీలకు(Adani Ambani) అప్పగించారని దీనికి పూర్తి బాధ్యత వహించాల్సింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీనేనని ఆరోపించారు. తాను పాదయాత్ర ప్రారంభమైన నాటి నుంచి నేటి దాకా తాను ఎక్కడా హింసను చూడలేదన్నారు.
కానీ టీవీ ఆన్ చేస్తే మాత్రం హింసను చూస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్ని, వారి ఇబ్బందుల్ని అమ్ముడు పోయిన మీడియా చూపించదంటూ ఆరోపించారు. అది కేవలం మోదీని మాత్రమే చూపిస్తుందని ధ్వజమెత్తారు.
నాకున్న ఇమేజ్ ను నాశనం చేసేందుకు కోట్లాది రూపాయలను బీజేపీ, ప్రధాని మోదీ ఖర్చు చేశారంటూ ఆరోపించారు. కానీ కేవలం నెల రోజుల్లోనే తానేమిటో చూపించానని అన్నారు.
Also Read : రాహుల్ పప్పు కాదు దమ్మున్నోడు