Rahul Gandhi Yatra : పోటెత్తిన జనం యాత్రకు బ్రహ్మరథం
భారత్ జోడో యాత్రకు ప్రజలు జేజేలు
Rahul Gandhi Yatra : అంతర్గత సమస్యలతో సతమతం అవుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని రీతిలో సపోర్ట్ దొరికింది రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర. ఈ దేశానికి ద్వేషం కాదు కావాల్సింది ప్రేమ అని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఈ ఏడాది సెప్టెంబర్ 6న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి యాత్రకు శ్రీకారం చుట్టారు.
మొత్తం 3,578 కిలోమీటర్లు 150 రోజుల పాటు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ఈ మేరకు ఇప్పటి వరకు 2,800 కిలోమీటర్లకు పైగా సాగింది. రాహుల్ గాంధీ ఇప్పటి వరకు తొమ్మిది రాష్ట్రాలలో పర్యటించారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ , రాజస్థాన్, హర్యానాలలో పూర్తయింది. ప్రస్తుతం ఢిల్లీలో కొనసాగింది.
ఈ సందర్భంగా దేశ రాజధానికి చేరుకున్న సమయంలో ఊహించని రీతిలో రాహుల్ గాంధీకి(Rahul Gandhi Yatra) పెద్ద ఎత్తున స్వాగతం లభించింది. ఉనికిని చాటుకునేందుకు వేలాది మంది మార్చ్ లో చేరారు. ఒక రకంగా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు జేజేలు పలికారు. ఒక రకంగా చెప్పాలంటే బ్రహ్మరథం పట్టారు.
ఈ యాత్రలో పదవీ విరమణ పొందిన సైనికులు, విద్యార్థులు, గృహిణులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ , యువకులు, వృద్దులు భారత్ జోడో యాత్రలో పాల్గొనడం విశేషం. ఇతర నగరాల నుండి యాత్రలో చేరడం విశేషం. ఈ యాత్ర ముంబై ద్వారా వెళ్లలేదు. ఈ సానుకూల ఉద్యమంలో భాగం కావాలని నిశ్చయించుకున్నాం.
గత ఎనిమిదేళ్లుగా చాలా విభజనలు చోటు చేసుకున్నాయి. ఇది తమకు ప్రియమైనదని రాధా శ్యామ్ అనే పరిశోధకురాలు పేర్కొనడం విశేషం.
Also Read : ఇది అంబానీ..అదానీ సర్కార్