Gali Janardhan Reddy New Party : గాలి జనార్దన్ రెడ్డి కొత్త పార్టీ
భారతీయ జనతా పార్టీకి కటీఫ్
Gali Janardhan Reddy New Party : కర్ణాటక రాజకీయాలలో పెను సంచలనం చోటు చేసుకుంది. ఇప్పటి దాకా కీలకమైన రాజకీయ నాయకుడిగా పేరొందిన ప్రముఖ మైనింగ్ డాన్ గాలి జనార్దన్ రెడ్డి(Gali Janardhan Reddy) కీలక ప్రకటన చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను కొత్త పార్టీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 2023లో కర్ణాటక రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని చెప్పారు.
అక్రమ మైనింగ్ కేసులో నిందితుడిగా ఉన్నారు గాలి జనార్దన్ రెడ్డి. ఆయన గత 20 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీతో అనుబంధం కలిగి ఉన్నారు. దానిని తెంచుకున్నట్లు తానే ప్రకటించారు. ఆయన గతంలో మంత్రిగా పని చేశారు. గనుల వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. ఇవాళ కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు.
కర్ణాటక రాజకీయాల్లోకి తిరిగి ప్రవేశించిన ఆయన 2023 శాసన సభ ఎన్నికల్లో కొప్పల్ జిల్లా లోని గంగావతి నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తాను ఆ పార్టీకి చెందిన వాడిని కానని, దానితో ఎలాంటి సంబంధం లేదని బీజేపీ నేతలు ఇప్పటికే చెబుతూ వచ్చారు. కానీ తాను ఆపార్టీకి చెందిన వాడినేనని రాష్ట్రం, ప్రజలు విశ్వసించారు.
ఆ నమ్మకం అబద్దమని తేలింది. కళ్యాణ రాజ్య ప్రగతి పక్షం నా స్వంత ఆలోచనలతో పుట్టుకు వచ్చిందన్నారు గాలి జనార్దన్ రెడ్డి(Gali Janardhan Reddy). మతం, కులం పేరుతో విభజన రాజకీయాలను వ్యతిరేకించే 12వ శతాబ్దపు సంఘ సంస్కర్త బసవన్న ఆలోచనతో ఏర్పాటు చేశానని ప్రకటించారు.
Also Read : వాజపేయ్ జీవితం స్ఫూర్తిదాయకం