US Blizzard : మంచు తుఫాను దెబ్బ‌కు అమెరికా విల‌విల‌

క్రిస్మ‌స్ వేల 31 మంది మ‌ర‌ణం

US Blizzard : ఎడ తెరిపి లేకుండా మంచు తుఫాను విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు మంచు తుపాను(US Blizzard) తాకిడి కార‌ణంగా ఏకంగా 31 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారికంగా అమెరికా స‌ర్కార్ వెల్ల‌డించింది. ప‌శ్చిమ న్యూయార్క్ లోని బ‌ఫెలోలో సంక్షోభ‌ ప‌రిస్థితి ఏర్ప‌డింది. న‌గ‌రాన్ని మంచు తుఫాను న‌గ‌రాన్ని అత‌లాకుత‌లం చేసింది.

అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప ప్ర‌జ‌లు ఎవ‌రూ బ‌య‌ట‌కు రావ‌ద్దంటూ కోరింది అమెరికా ప్ర‌భుత్వం. అత్య‌వ‌స‌ర సేవ‌ల కోసం జ‌నం అల్లాడుతున్నారు. తుఫాను ప్ర‌భావిత ప్రాంతాల‌కు చేరుకోలేక పోయాయి. యుఎస్ లో క్రిస్మ‌స్ పండుగ వేళ విషాదం అలుముకుంది. విప‌రీత‌మైన వాతావ‌ర‌ణం కార‌ణంగా వారాంతపు చ‌లి ఉష్ణోగ్ర‌త‌లు గ‌డ్డ క‌ట్టే స్థాయికి దిగువ‌న ఉన్నాయి.

ఈ శీతాకాల‌పు తుఫాను మిలియ‌న్ల మంది అమెరిక‌న్ల‌ను తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేసింది. అమెరిక‌న్ల‌కు క్రిస్మ‌స్ రోజు ప్ర‌మాదాన్ని, క‌ష్టాల‌ను తెచ్చి పెట్టింది. తూర్పు అమెరికా లోని కొన్ని ప్రాంతాల‌లో తీవ్ర‌మైన మంచు నెల‌కొంది. అమెరికా ప్ర‌భుత్వం ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించింది. రోడ్ల‌పై మంచు పేరుకు పోయింది.

వాహ‌నాల‌న్నీ ఎక్క‌డిక‌క్క‌డ నిలిచి పోయాయి. ఎనిమిది అడుగుల మేర మంచు నిలిచి ఉంది. విద్యుత్ అంతరాయం ఏర్ప‌డింది. సాధార‌ణ ప్ర‌జానీకం తీవ్ర ఇబ్బందుల‌ను ఎదుర్కొంటోంది. తూర్పు రాష్ట్రాల‌లో 2,00,000 కంటే ఎక్కువ మంది ప్ర‌జ‌లు క్రిస్మ‌స్ ను విద్యుత్ లేకుండానే మేల్కొన్నారు.
వైపు మంచు తుఫాను తాకిడి మ‌రో వైపు భ‌యంక‌ర‌మైన గాలుల‌తో అమెరికా వ‌ణుకుతోంది. మంచు తుఫాను కార‌ణంగా ప‌లు విమానాల రాక పోక‌ల‌ను ర‌ద్దు చేశారు.

Also Read : యుద్దాన్ని ముగించ‌డం ర‌ష్యా లక్ష్యం

Leave A Reply

Your Email Id will not be published!