MK Stalin Rahul Gandhi : రాహుల్ స్పీచ్ అదుర్స్ – ఎంకే స్టాలిన్
దేశంలో ప్రకంపనలు రేపుతున్న కామెంట్స్
MK Stalin Rahul Gandhi : కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించారు డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ చేస్తున్న ప్రసంగాలు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయని కితాబు ఇచ్చారు. మాజీ ప్రధాని, దివంగత జవహర్ లాల్ నెహ్రూపై రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు ఏ. గోపన్న రాసిన మమనితార్ నెహ్రూ పుస్తకాన్ని సీఎం స్టాలిన్(MK Stalin) ఆవిష్కరించారు.
అనంతరం సీఎం ప్రసంగించారు. రాహుల్ గాంధీ ఎన్నికల రాజకీయాల గురించి ప్రస్తావించడం లేదన్నారు. కానీ భావజాల రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని కితాబు ఇచ్చారు ఎంకే స్టాలిన్. లౌకిక వాదం, సమానత్వం వంటి విలువలను కాపాడేందుకు నెహ్రూ, గాంధీ చేసిన సేవలు ప్రశంసనీయమన్నారు.
నెహ్రూ నిజమైన ప్రజాస్వామ్య వాది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ప్రతీక. అందుకే అన్ని ప్రజాస్వామ్య శక్తులు ఆయనను గుర్తించాయని పేర్కొన్నారు ఎంకే స్టాలిన్. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై నిప్పులు చెరిగారు. ఇవాళ పార్లమెంట్ లో ముఖ్యమైన అంశాలను కూడా చర్చకు అనుమతించడం లేదని ఆరోపించారు.
నెహ్రూ వ్యతిరేక అభిప్రాయాలను ప్రోత్సహించారంటూ మండిపడ్డారు ఎంకే స్టాలిన్. ప్రభుత్వ రంగ సంస్థలను కావాలని నిర్వీర్యం చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రజలు క్షమించరని అన్నారు సీఎం. తమిళనాడుకు పెరియార్ , అన్నాదురై, కలైంజర్ ఆదర్శ ప్రాయంగా ఉన్నారని గుర్తు చేశారు ఎంకే స్టాలిన్.
గాంధీ, నెహ్రూ వారసుడిగా రాహుల్ గాంధీ తనదైన ముద్ర కనబరుస్తున్నారని కితాబు ఇచ్చారు. కానీ ఆయన కామెంట్స్ బీజేపీకి కంటగింపుగా మారాయని అన్నారు.
Also Read : గ్వాలియర్ లో అటల్ జీ స్మారక చిహ్నం