Amit Shah : దేశ‌మంత‌టా గుజ‌రాత్ రిజ‌ల్ట్స్ రిపీట్ – అమిత్ షా

కేంద్ర హోం శాఖ మంత్రి జోష్యం

Amit Shah : కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గుజ‌రాత్ లో భార‌తీయ జ‌న‌తా పార్టీకి చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టార‌ని ఇవే ఫ‌లితాలు రాబోయే 2024లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో రిపీట్ కావ‌డం ఖాయ‌మ‌న్నారు కేంద్ర మంత్రి. గెలుపొందిన ఎమ్మెల్యేల‌కు స‌న్మానం చేశారు.

ఈ సంద‌ర్భంగా అమిత్ షా ప్ర‌సంగించారు. అసెంబ్లీ ఎన్నిక‌లు రాబోయే ఎన్నిక‌ల్లో మ‌రింత బ‌లంగా ప‌ని చేసేందుకు దోహ‌దం చేస్తాయ‌న్నారు. రికార్డు స్థాయిలో ఫ‌లితాలు సాధించేందుకు కార్య‌క‌ర్త‌లే కార‌ణ‌మ‌ని కితాబు ఇచ్చారు అమిత్ షా(Amit Shah). ఈ స‌క్సెస్ భార‌తీయ రాజ‌కీయ చిత్రాన్ని పూర్తిగా మార్చి వేసింద‌న్నారు.

ఒక ర‌కంగా ఇది సానుకూల ప్ర‌భావం చూపుతుంద‌న్నారు కేంద్ర హొం శాఖ మంత్రి. దేశంలో ఎక్క‌డా లేని విధంగా గుజ‌రాత్ ప్ర‌జ‌లు అద్బుత‌మైన తీర్పు ఇచ్చార‌ని ఇందుకు ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్నామ‌ని అన్నారు అమిత్ చంద్ర షా. గ‌తంలో న‌రేంద్ర మోదీ హ‌యాంలో అత్య‌ధిక స్థానాలు గెలుచుకున్నామ‌ని, అదే రికార్డును భార‌తీయ జ‌న‌తా పార్టీ తిర‌గ రాసింద‌న్నారు.

ఈ సారి ఎన్నిక‌లు అభివృద్ధికి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టారు. ఎన్నో పార్టీలు వ‌చ్చాయి. లెక్క‌లేన‌న్ని హామీలు ఇచ్చాయి. లేనిపోని క‌బ‌ర్లు చెప్పాయి. కానీ వీటిని ఏవీ జ‌నం న‌మ్మ‌లేద‌ని దిమ్మ తిరిగేలా స‌మాధానం ఇచ్చార‌ని అన్నారు అమిత్ చంద్ర షా(Amit Shah). సానుకూల దృక్ప‌థంతో తాము ముందుకు వెళ్లామ‌ని అదే త‌మ‌ను కాపాడింద‌న్నారు.

రాబోయే రోజుల్లో ఇచ్చిన హామీల‌ను నెర‌వేరుస్తామ‌ని ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు కేంద్ర మంత్రి.

Also Read : లాలూకు సీబీఐ షాక్ మ‌రోసారి విచార‌ణ‌

Leave A Reply

Your Email Id will not be published!