CBI Re Opens Lalu : లాలూకు సీబీఐ షాక్ మ‌రోసారి విచార‌ణ‌

రైల్వే ప్రాజెక్టుల కేసులో ద‌ర్యాప్తు సంస్థ ఆరా

CBI Re Opens Lalu : తీవ్ర అనారోగ్యానికి గురై ఇబ్బందులు ప‌డుతున్న బీహార్ రాష్ట్ర మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. ఇప్ప‌టికే త‌న కూతురు కిడ్నీ ఇచ్చింది. ఆయ‌న‌ను కాపాడింది. ఇప్ప‌టికే దాణా కేసులో శిక్ష అనుభ‌విస్తున్నారు. ఇదిలా ఉండ‌గా తాజాగా రైల్వే ప్రాజెక్టుల కేసులో మ‌రోసారి విచార‌ణ చేప‌ట్టింది లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ పై(CBI Re Opens Lalu).

యూపీఏ స‌ర్కార్ హ‌యాంలో లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ స‌మ‌యంలో ప్రాజెక్టుల కేటాయింపుల్లో అవినీతి అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ మేర‌కు 2018లో విచార‌ణ చేప‌ట్టింది. తాజాగా ఇదే కేసుకు సంబంధించి మ‌రోసారి విచార‌ణకు దిగింది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ.

ఇదిలా ఉండ‌గా భార‌తీయ జ‌న‌తా పార్టీతో 17 ఏళ్ల అనుబంధాన్ని జన‌తాద‌ళ్ యూ చీఫ్ , సీఎం నితీశ్ కుమార్ తెగ‌దెంపులు చేసుకున్నారు. ఇదే స‌మ‌యంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ పార్టీతో క‌లిసి మ‌హా ఘ‌ట్ బంధ‌న్ స‌ర్కార్ ను ఏర్పాటు చేశారు.

దీంతో కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ స‌ర్కార్ ఇబ్బందుల‌కు గురి చేస్తోంద‌ని ఆరోపించారు లాలూ ప్ర‌సాద్ యాద‌వ్(CBI Re Opens Lalu) త‌న‌యుడు, డిప్యూటీ సీఎం తేజ‌స్వి యాద‌వ్. నితీశ్ తో జ‌త క‌ట్టినందుకే అవినీతి కేసును తిరిగి తెరిచిందంటూ మండిప‌డ్డారు.

ఇదిలా ఉండ‌గా మే, 2021లో ఆరోప‌ణ‌లు రుజువు కాలేద‌ని అందుకే కేసు మూసి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది సీబీఐ. కానీ నితీశ్ తో స‌ర్కార్ ఏర్పాటు చేశాక తిరిగి కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ తెర‌వ‌డం రాజ‌కీయ క‌క్ష సాధింపు త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు.

Also Read : రాహుల్ గాంధీతో మాట్లాడితే ‘ఐబీ’ టార్గెట్

Leave A Reply

Your Email Id will not be published!