Rahul Gandhi Tribute : తండ్రి రాజీవ్ కు తనయుడి నివాళి
గాంధీ, నెహ్రూ, ఇందిర, శాస్త్రి, అటల్ కు నివాళి
Rahul Gandhi Tribute : కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi Tribute) సోమవారం ఉదయం తన తండ్రి మాజీ ప్రధాన మంత్రి, దివంగత రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించారు. ఢిల్లీలోని స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నమస్కరించారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధానమంత్రులు జవహర్ లాల్ నెహ్రూ , ఇందిరా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, అటల్ బిహారీ వాజ్ పేయ్ లకు నివాళులు అర్పించారు రాహుల్ గాంధీ.
కాంగ్రెస్ ఎంపీ తన భారత్ జోడో యాత్ర నుండి వారం రోజుల పాటు విరామం తీసుకున్నారు. ఈ యాత్ర సందర్భంగా వాడుతున్న వాహనాలు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు గాను యాత్రను నిలిపి వేశారు. ఢిల్లీలోని వీర్ భూమి వద్ద టీ షర్టు , ప్యాంటులో కనిపించారు రాహుల్ గాంధీ.
ఉత్తర భారత దేశం అంతటా చలిగాలులు వ్యాపిస్తున్న సమయంలో ఎలాంటి చడీ చప్పుడు లేకుండా ఈ అగ్ర నాయకుడు చెప్పులు ధరించకుండానే నడవడం పార్టీ శ్రేణులను విస్తు పోయేలా చేసింది. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 6న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్రను చేపట్టారు రాహుల్ గాంధీ.
ఇప్పటి వరకు 2,800 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. తమిళనాడు, కేరళ, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ , రాజస్థాన్ , హర్యానా రాష్ట్రాలలో యాత్ర పూర్తిగా కాగా ఇంకా 800 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాల్సి ఉంది. కన్యాకుమారి నుంచి మొదలైన ఈ యాత్ర కాశ్మీర్ దాకా కొనసాగనుంది. ఢిల్లీకి చేరుకున్న సందర్భంగా రెడ్ ఫోర్డ్ వద్ద ప్రజలను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు.
Also Read : రాహుల్ గాంధీతో మాట్లాడితే ‘ఐబీ’ టార్గెట్