Abhishek Singhvi : అభిషేక్ సింఘ్వీ షాకింగ్ కామెంట్స్
న్యాయ వ్యవస్థ నిర్వీర్యానికి ప్రయత్నం
Abhishek Singhvi : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింఘ్వీ షాకింగ్ కామెంట్స్ చేశారు. భారత దేశంలోని న్యాయమూర్తులను ఉన్నత న్యాయ వ్యవస్థకు నియమించే విధానాన్ని మార్చేందుకు అసాధారణ ఏకాభిప్రాయం ఉండాలని స్పష్టం చేశారు. యూసీసీ బిల్లుకు సంబంధించి రాసిన కాగితంపై బిల్లుకు విలువ లేదన్నారు అభిషేక్ సింఘ్వీ(Abhishek Singhvi) .
దేశంలోని యూనివర్శిల్ సివిల్ కోడ్ పై ప్రైవేట్ మెంబర్ బిల్లును కూడా కొట్టి వేశారు. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ నియామకాల కమిషన్ పై ప్రస్తుత సర్కార్ సమస్యగా మార్చేందుకు ప్రయత్నం చేస్తోందా అన్న ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు అభిషేక్ సింఘ్వీ. ఇది విచారకరం, బాధ కలిగించే అంశం. ఆమోద యోగ్యం ఎన్నటికీ కాదన్నారు.
కేవలం ఒకే ఒక సంవత్సరం మిగిలి ఉన్న ప్రభుత్వానికి ప్రాథమిక రాజ్యాంగ సవరణలు చేసే పని లేదన్నారు. బీజేపీ సర్కార్ కావాలని ముందుకు తెస్తోందని ఆరోపించారు అభిషేక్ సింఘ్వీ. గత తొమ్మిది సంవత్సరాల కాలంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో చాలా సంస్థలు మార్పునకు లోనయ్యాయని తెలిపారు.
మిగతా సంస్థలు ఇందుకు మినహాయింపు ఏమీ కాదన్నారు అభిషేక్ సింఘ్వీ. ఇందులో ప్రధానంగా ఎన్నికల కమిషన్ , కంప్ట్రోలర్ , ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా , తదితర సంస్థలన్నీ సర్కార్ కు జేబు సంస్థలుగా మారాయని ఆరోపించారు సింఘ్వీ(Abhishek Singhvi) .
దేశంలోని ప్రతి పౌరుడి లాగే ప్రతి వ్యక్తి తన అభిప్రాయాలకు అర్హులు అని పేర్కొన్నారు. కానీ ఎన్జీఏసీ సమస్యను మరింత పెద్దదిగా చూపేట్టేందుకు బీజేపీ సర్కార్ యత్నిస్తోందన్నారు.
Also Read : కాశ్మీరీ పండిట్లను జమ్మూకు పంపాలి