Ghulam Nabi Azad : కాశ్మీరీ పండిట్లను జమ్మూకు పంపాలి
భద్రత ముఖ్యమన్న గులాం నబీ ఆజాద్
Ghulam Nabi Azad : కాశ్మీరీ పండిట్ల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు మాజీ కేంద్ర మంద్రి డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ (డీఏపీ) చీఫ్ గులాం నబీ ఆజాద్. కాశ్మీర్ పండిట్లను ఉగ్రవాదులు టార్గెట్ చేశారని ఆవేదన చెందారు. కేంద్ర ప్రభుత్వం వీరి విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు గులాం నబీ ఆజాద్.
జమ్మూ లోని యూనివర్శిటీ ఆడిటోరియంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం కాశ్మీర్ లోయలో పరిస్థితి మెరుగు పడేంత వరకు పండిట్లను జమ్మూకు పంపించాలని గులాం నబీ ఆజాద్(Ghulam Nabi Azad) కోరారు. ఆయన గతంలో జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రానికి సీఎంగా పని చేశారు.
పండిట్లపై చేసిన ప్రకటన ఈ ఏడాది జమ్మూ , కాశ్మీర్ లో తీవ్రవాద సంఘటనలు, పౌర హత్యల పెరుగుదలపై ఆందోళనలను మరింత కలిగించేలా చేసింది. తన హయాంలో కాశ్మీరీ పండిట్లకు ఉద్యోగాలు ఇవ్వాలని అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చామన్నారు గులాం నబీ ఆజాద్ .
దాదాపు 3 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. కానీ అప్పట్లో ఎవరూ పట్టించు కోలేదన్నారు. ఆ తర్వాత అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. జీవితం చాలా ముఖ్యమైనది. ప్రస్తుతం పరిస్థితి దయనీయంగా ఉంది.
ఈ తరుణంలో వారిని జమ్మూకు పంపించడం మినహా మరో మార్గం లేదన్నారు. ప్రాణాల కంటే ఉద్యోగాలు ముఖ్యమైనవి కావన్నారు. తాము అధికారంలోకి వస్తే తప్పకుండా వారిని జమ్మూకు తీసుకు వస్తామని స్పష్టం చేశారు గులాం నబీ ఆజాద్(Ghulam Nabi Azad).
Also Read : అభిషేక్ సింఘ్వీ షాకింగ్ కామెంట్స్