TS High Court Shock CM KCR : సీఎం సారుకు హైకోర్టు బిగ్ షాక్

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి

TS High Court Shock CM KCR : భార‌త రాష్ట్ర స‌మితికి చెందిన న‌లుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారంలో కోలుకోలేని షాక్ త‌గిలింది ఆ పార్టీ చీఫ్ , సీఎం కేసీఆర్ కు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన సిట్ చెల్ల‌దంటూ కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐకి అప్ప‌గించాల‌ని ఆదేశించింది కోర్టు.

రాజ‌కీయంగా దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారానికి సంబంధించిన కేసును విచారించిన రాష్ట్ర స‌ర్కార్ నియ‌మించిన ప్ర‌త్యేక దర్యాప్తు బృందాన్ని కూడా హైకోర్టు ర‌ద్దు చేసింది.

ఇదిలా ఉండ‌గా త‌మ ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు ఈ న‌లుగురు ఎమ్మెల్యేల‌ను ఒక్కొక్క‌రికి రూ. 100 కోట్ల ఎర చూపిందంటూ కేసీఆర్ ఆరోపించారు. ఇదిలా ఉండ‌గా హైకోర్టు ఆదేశాల‌ను సుప్రీంకోర్టులో(TS High Court) స‌వాల్ చేయ‌నున్న‌ట్లు సిట్ సోమ‌వారం ప్ర‌క‌టించింది. ఇదిలా ఉండ‌గా హైకోర్టు నిర్ణ‌యాన్ని తాము స్వాగ‌తిస్తున్న‌ట్లు భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌, న్యాయ‌వాది రామ్ చంద‌ర్ రావు తెలిపారు.

ఇదిలా ఉండ‌గా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వ‌ల బాల‌రాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైల‌ట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతా రావు ఉన్నారు. వీరిలో ప్ర‌ధానంగా పైల‌ట్ రోహిత్ రెడ్డిపై బెంగ‌ళూరు డ్ర‌గ్స్ కేసు న‌మోదైంది.

ఇప్ప‌టికే ఆయ‌న‌తో పాటు న‌టి ర‌కుల్ ప్రీత్ సింగ్ కు నోటీసులు జారీ చేసింది. ఈ మేర‌కు పైల‌ట్ రోహిత్ రెడ్డిని విచారించింది. కాగా త‌న‌ను కావాల‌ని ఈడీ ఇరికించాల‌ని చూస్తోందంటూ ఎమ్మెల్యే పైల‌ట్ ఆరోపించారు. మొత్తంగా మీద సంచ‌లనం క‌లిగించిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారం ఇప్పుడు సీబీఐ మెట్ల‌కు ఎక్కడం ఒక ర‌కంగా సీఎంకు(CM KCR) బిగ్ షాక్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.

Also Read : అప్పులు తెచ్చిండు ఆగం చేసిండు

Leave A Reply

Your Email Id will not be published!