Rahul Gandhi Yatra : చలిని లెక్క చేయని రాహుల్
దేశం కోసం తప్పని త్యాగం
Rahul Gandhi Yatra : దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చర్చనీయాంశంగా మారారు. ఆయన రెడ్ ఫోర్డ్ సాక్షిగా చేసిన ప్రసంగం చాలా మందిని కదిలించింది. చప్పట్లు కొట్టేలా చేసింది. డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అయితే తాత నెహ్రూకు తగ్గ మనుమడు అంటూ కితాబు ఇచ్చారు.
అందరూ రాజకీయాలను ప్రాతిపదికగా చేసుకుని ఇంత కాలం ఆరోపణలు చేస్తూ వచ్చారని కానీ రాహుల్ గాంధీ వారికంటే భిన్నంగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారంటూ పేర్కొన్నారు. ఇందులో వంద శాతం వాస్తవం ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ(Rahul Gandhi Yatra) విభిన్న భావజాలాలతో కూడిన రాజకీయాలు మాట్లాడడం ఆశ్చర్య పోయేలా చేసింది. విపక్షాలను ఒకే చోటుకు చేర్చేలా చేసింది.
రాహుల్ గాంధీని నిన్నటి దాకా భారతీయ జనతా పార్టీ ట్రోల్ చేస్తూ వచ్చింది. పప్పు అని ఎద్దేవా చేసింది. కానీ ఆయన కేవలం అతి కొద్ది కాలంలో మోస్ట్ పాపులర్ లీడర్ గా పేరొందారు. అంతే కాదు తాను పప్పూను కాదని ఫ్లవర్ అంతకంటే కాదని ఫైర్ అంటూ ప్రూవ్ చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని, అది అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్ర స్థాయిలో ఎండగట్టారు.
ప్రజల నుంచే తమకు ఏం సమస్యలు ఉన్నాయో అనిపించారు. ఇది నాయకుడికి ఉండాల్సిన మెరుగైన లక్షణం. ఈ దేశంలో అన్నింటినీ అమ్మేసుకుంటూ వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) చివరకు దేశానికి చిహ్నంగా ఉన్న తాజ్ మహల్ ను కూడా అదానీ, అంబానీలకు అమ్మేస్తాడంటూ ఎద్దేవా చేశారు రాహుల్ గాంధీ.
Also Read : ఇళ్లల్లో కత్తులకు పదును పెట్టండి – ప్రగ్యా