CBI Line Clear : సీబీఐకి లైన్ క్లియ‌ర్

టీఎస్ స‌ర్కార్ కు షాక్

CBI Line Clear : దేశ వ్యాప్తంగా సంచ‌లనం సృష్టించింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు. భార‌తీయ జ‌న‌తా పార్టీ ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 100 కోట్లు ఎర‌గా చూపి తెలంగాణ‌లో కేసీఆర్ స‌ర్కార్ ను ప‌డ‌గొట్టాల‌ని ప్లాన్ చేసిందంటూ సీఎం ఆరోపించారు. ఆపై సిట్ ను ఏర్పాటు చేశారు. నోటీసులు, కేసులు, అరెస్ట్ ల దాకా వెళ్లింది. చివ‌ర‌కు కోర్టు మెట్లు ఎక్కింది వ్య‌వ‌హారం. దొడ్డి దారిన రాష్ట్ర స‌ర్కార్ జారీ చేసిన జీవో నెంబ‌ర్ 51 చెల్లుబాటు లేకుండా చేసింది హైకోర్టు.

కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టాల‌ని చేసిన ప్లాన్ బెడిసి కొట్టింది. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ తెలంగాణ‌లో ఎంటర్ కాకూడ‌ద‌ని ఈ జీవోలో పేర్కొంది ప్ర‌భుత్వం. దీనికి పూర్తిగా చెక్ పెట్టింది కోర్టు. దీంతో సీబీఐ(CBI Line Clear)  ఏ స‌మ‌యంలోనైనా ప్ర‌వేశించేందుకు వీలు క‌లుగుతుంది. ఇక నుంచి ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి విచారించేందుకు ఉన్న అడ్డంకి తొల‌గ‌డంతో ఇక విచార‌ణ చేప‌ట్టేందుకు వీలు క‌లుగుతుంది.

ఇదే స‌మ‌యంలో సీఎం ముద్దుల కూతురు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌వితపై ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ క‌ల‌క‌లం రేపింది. ఆమెను అరెస్ట్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం అందుకున్న టీఎస్ స‌ర్కార్ జీవో నెంబ‌ర్ 51ని తీసుకు వ‌చ్చింది. ఇందులో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు రాకుండా చెక్ పెట్టింది. విచిత్రం ఏమిటంటే జీవోను ఆగ‌స్టు 30న తీసుకు వ‌చ్చింది.

దానిని ర‌హ‌స్యంగా ఉంచింది. కోర్టులో ఏజీ చెప్పేంత దాకా తెలియ‌లేదు. ఇక ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆగేది లేదంటూ సీబీఐ రంగంలోకి దిగ‌నుంది. ఇవాళ ఎమ్మెల్యే పైల‌ట్ రోహిత్ రెడ్డిని విచారించ‌నుంది ఈడీ.

Also Read : సీఎం సారుకు హైకోర్టు బిగ్ షాక్

Leave A Reply

Your Email Id will not be published!