TTD Darshan : దర్శన విధానంలో మార్పు లేదు – టీటీడీ
కోవిడ్ సర్టిఫికెట్ ఉంటేనే స్వామి దర్శనం
TTD Darshan : కోవిడ్ సర్టిఫికెట్ ఉంటేనే తిరుమలలో స్వామి దర్శనం ఉంటుందని స్పష్టం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి. అయితే తిరుమల భక్తుల దర్శన విధానంలో మార్పు లేదని పేర్కొన్నారు. టీటీడీ ట్రస్టు బోర్డు సమావేశంలో ఆనంద నిలయం బంగారు తాపడంపై మాత్రమే నిర్ణయం తీసుకుందని తెలిపారు.
అయితే భక్తుల దర్శనానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. ఆలయ గర్భగుడిపై ఉన్న ఆనంద నిలయం, గోపురాన్ని పునరుద్దరించడంతో పాటు తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం(TTD Darshan) నిలిపివేతపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మరోసారి వెల్లడించారు ఎస్వీఎస్. అయితే ఫిబ్రవరి 23న బాలాలయం నిర్మాణం ప్రారంభం కానుందని తెలిపారు.
భక్తుల దర్శన విధానంలో ఎలాంటి మార్పు ఉండదని టీటీడీ చైర్మన్ పేర్కొన్నారు. భక్తులు యథావిధిగా స్వామి వారిని దర్శనం చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా వచ్చే ఏడాది 2023 ఫిబ్రవరి మొదటి వారంలో మరోసారి టీటీడీ ట్రస్టు బోర్డు సమావేశం కానుందని పేర్కొన్నారు.
ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారి గురించి హెచ్చరించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు తిరుమలకు వచ్చే భక్తులు విధిగా కోవిడ్ సర్టిఫికెట్ సమర్పించాలని అది కేవలం 48 గంటల లోపు మాత్రమే ఉండాలని పేర్కొన్నారు ఎస్వీ సుబ్బారెడ్డి.
బంగారు తాపడం చేయాలంటే దర్శనానికి(TTD Darshan) ఇబ్బంది కలుగుతుంది. కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు సమయం పడుతుంది. భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఆగమ నిపుణులు, అర్చకులతో టీటీడీ చర్చిస్తోందని తెలిపారు టీటీడీ చైర్మన్.
Also Read : మల్లన్న సేవలో ముర్ము