Gaurav Bhatia : గాంధీ ఫ్యామిలీ అవినీతికి కేరాఫ్ – భాటియా
బీజేపీ అధికార ప్రతినిధి షాకింగ్ కామెంట్స్
Gaurav Bhatia : తనపై మనీ లాండరింగ్ దర్యాప్తును రద్దు చేయాలని కోరుతూ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా దాఖలు చేసిన పిటిషన్ ను తిరస్కరించింది రాజస్థాన్ కోర్టు. తనపై వచ్చిన ఆరోపణలు రాజకీయంగా చేసినవేనంటూ పేర్కొన్నారు వాద్రా తన పిటిషన్ లో . దీనిపై విచారణ చేపట్టింది కోర్టు. ఈ మేరకు చట్టం ముందు అందరూ సమానులేనని, ఎవరైనా సరే అతీతులు కారని స్పష్టం చేసింది.
ఇందులో భాగంగా తనపై చేసిన ఆరోపణలు లేదా విమర్శలు తప్పని నిరూపించు కోవాల్సిన బాధ్యత పిటిషన్ దారుడిపై ఉంటుందని పేర్కొంది కోర్టు. ఇదిలా ఉండగా రాబర్ట్ వాద్రా పిటిషన్ ను తిరస్కరించడంతో భారతీయ జనతా పార్టీ స్పందించింది. ఈ మేరకు గాంధీ ఫ్యామిలీ అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అంటూ ఆరోపించింది.
ఇప్పటికైనా ప్రజలు తెలుసు కోవాలని సూచించింది. పైకి నీతులు వల్లిస్తూ, బీజేపీపై బురద చల్లేందుకు పదే పదే ప్రయత్నం చేస్తున్న రాహుల్ గాంధీ ముందు తెలుసుకుంటే బెటర్ అని ఎద్దేవా చేసింది. భారత దేశ రాజకీయాల్లో అత్యంత అవినీతి కుటుంబం ఏదైనా ఉందంటే అది గాంధీ ఫ్యామిలీనేనని పేర్కొంది బీజేపీ.
కాగా రాబర్ట్ వాద్రాపై అవినీతి, మనీ లాండరింగ్ ఆరోపణలపై రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మౌనం వీడాలని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా(Gaurav Bhatia) డిమాండ్ చేశారు.
బికనీర్ లో వాద్రా, అతని తల్లికి సంబంధం ఉన్న కంపెనీ అక్రమ మార్గాల ద్వారా భూమిని కొనుగోలు చేయడంపై ఈడీ దర్యాప్తును రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కీలక తీర్పు ప్రకటించింది కోర్టు.
Also Read : సంస్కారం లేక పోతే సర్వ నాశనం