MK Stalin : చరిత్ర వ‌క్రీక‌ర‌ణ‌ దేశానికి ప్ర‌మాదం – స్టాలిన్

త‌మిళ‌నాడు సీఎం షాకింగ్ కామెంట్స్

MK Stalin : డీఎంకే చీఫ్‌, త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న ప్ర‌ధానంగా చ‌రిత్ర గురించి ప్ర‌స్తావించారు. చ‌రిత్ర‌ను ఈ మ‌ధ్య వ‌క్రీక‌రించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు హిస్ట‌రీని ప‌క్క‌దారి ప‌ట్టిస్తే అది దేశానికి అత్యంత ప్ర‌మాద‌క‌రంగా త‌యార‌య్యే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించారు సీఎం.

ఇండియ‌న్ హిస్ట‌రీ కాంగ్రెస్ 81వ వార్షిక స‌మావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు ఎంకే స్టాలిన్. ఏ ప్ర‌భుత్వ‌మైనా దేశంలో లౌకిక వాదంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. మ‌తం పేరుతో లేదా కులం, ప్రాంతం పేరుతో మ‌నుషుల‌ను విడ‌దీయాల‌ని అనుకోవ‌డం త‌ప్పు అని పేర్కొన్నారు.

ఇటీవ‌లి కాలంలో ఒక‌రి చ‌రిత్ర గొప్ప‌ద‌ని ఇంకొక‌రి చ‌రిత్ర త‌క్కువ అనే ముద్ర వేస్తున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప‌రిజ్ఞానం ఉన్న స‌మాజం ఇలాంటి సిద్దాంతాల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అంగీక‌రించ‌ద‌ని చెప్పారు ఎంకే స్టాలిన్(MK Stalin). ఆయ‌న ప‌రోక్షంగా భార‌తీయ జ‌న‌తా పార్టీని , దాని అనుబంధ సంస్థ‌లు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను ఎత్తి చూపారు.

ఈ సంద‌ర్భంగా సీఎం కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. కొంత మంది చ‌రిత్ర‌గా చెప్ప‌బ‌డుతున్న క‌ల్పిత క‌థ‌ల జోలికి వెళ్ల‌వద్దని సూచించారు సీఎం. చ‌రిత్ర చ‌ద‌వ‌డం వ‌ల్ల లాభ‌దాయ‌క‌మైన కెరీర్ అనేది ఉంటుందా అని చాలా మంది అనుమానం వ్య‌క్తం చేస్తున్నార‌ని అన్నారు. డిగ్రీ పొంద‌డం, జీతం పొంద‌డం కాద‌న్నారు.

చ‌రిత్ర అన్న‌ది ఉంటుందని స్ప‌ష్టం చేశారు ఎంకే స్టాలిన్.

Also Read : యాత్ర‌కు అఖిలేష్..మాయావ‌తి దూరం

Leave A Reply

Your Email Id will not be published!