Nara Lokesh Yatra : కుప్పం నుంచి లోకేశ్ పాద‌యాత్ర

జ‌న‌వ‌రి 27 నుంచి యాత్ర‌కు శ్రీ‌కారం

Nara Lokesh Yatra : ఏపీలో రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కాయి. ఓ వైపు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇంకో వైపు టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ , బీజేపీ చీఫ్ సోమూ వీర్రాజు మాట‌ల యుద్దానికి తెర లేపారు. ఇంకా శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం ఎన్నిక‌ల వేడి మొద‌ల‌య్యిందా అన్న అనుమానం త‌లెత్తుతోంది.

ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌ల‌తో హోరెత్తిస్తున్నారు. ఛాలెంజ్ లు విసురుతూ స‌వాళ్ల ప‌ర్వానికి తెర తీశారు. ఇక టీడీపీలో నెంబ‌ర్ 2 గా ఉన్న చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు నారా లోకేశ్ త‌న‌దైన ముద్ర వేస్తూ వ‌చ్చారు. గ‌త ప్ర‌భుత్వంలో ఆయ‌న ఐటీ శాఖ మంత్రిగా ప‌ని చేశారు. తండ్రి ఇదేం ఖ‌ర్మ అనే పేరుతో ఇప్ప‌టికే ఏపీలోని ప‌లు జిల్లాల్లో ప‌ర్య‌టిస్తున్నారు.

అధికార పార్టీని దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంకో వైపు వైసీపీ గ‌డ‌ప గ‌డ‌ప పేరుతో ఇల్లిల్లు నేత‌లు జ‌ల్లెడ ప‌డుతున్నారు. త‌మ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలే గ‌ట్టెక్కిస్తాయ‌ని ఆ పార్టీ భావిస్తోంది. ఈ త‌రుణంలో మ‌రోసారి తాము ప‌వ‌ర్ లోకి రావాల‌ని తెలుగుదేశం పార్టీ పావులు క‌దుపుతోంది.

గ‌తంలో జ‌రిగిన ప‌రాభావానికి రివెంజ్ తీసుకోవాల‌ని అనుకుంటోంది. ఈసారి ప‌క‌డ్బందీ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా యూత్ లో మంచి ప‌ట్టు క‌లిగిన లోకేష్ పాద‌యాత్ర చేప‌ట్టేందుకు ప్లాన్ చేశారు. తేదీ కూడా ఖ‌రారు చేశారు. ఏపీలోని కుప్పం నుంచి జ‌న‌వ‌రి 27 నుండి లోకేశ్ పాద‌యాత్ర(Nara Lokesh Yatra) ప్రారంభం కానుంది. ఈ యాత్ర ఇచ్చాపురం దాకా కొన‌సాగ‌నుంది. మొత్తం 400 రోజులు 4 వేల కిలోమీట‌ర్లు పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్నారు.

Also Read : ఆర్టీసీ భ‌విష్య‌త్తుకు ఢోకా లేదు – ఎండీ

Leave A Reply

Your Email Id will not be published!