Covid19 Cases : 24 గంట‌ల్లో 188 క‌రోనా కేసులు

మ‌ర‌ణాలు ఏవీ లేవ‌న్న కేంద్రం

Covid19 Cases : ఓ వైపు చైనాను క‌మ్మేసింది క‌రోనా. రోజుకు వేలాది మంది క‌రోనా ధాటికి విల విల‌లాడి పోతున్నారు. ఈ త‌రుణంలో కేంద్ర ప్ర‌భుత్వం ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు చేపట్టింది. అల‌ర్ట్ గా ఉండాల‌ని ఆదేశించింది. ఈ మేర‌కు ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది.

ఇక గ‌తంలో భారీగా న‌మోదైన క‌రోనా కేసులు రాను రాను త‌గ్గుముఖం ప‌ట్టాయి. అయితే కొన్ని రోజులుగా కేసులు పెరుగుతుండ‌డం కొంత ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 188 క‌రోనా కేసులు(Covid19 Cases) న‌మోద‌య్యాయి. ఈ విష‌యాన్ని కేంద్ర కుటుంబ‌, ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధ‌వారం వెల్ల‌డించింది.

కాగా ఎలాంటి మ‌ర‌ణం న‌మోదు కాలేద‌ని స్ప‌ష్టం చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం క‌రోనా కార‌ణంగా భార‌త దేశంలో మ‌ర‌ణించిన వారి సంఖ్య 5,30,696గా ఉంద‌ని వెల్ల‌డించింది. దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్యా ప‌రంగా చూస్తే 3,468 కేసులు ఉండ‌డం గ‌మ‌నార్హం. దేశ వ్యాప్తంగా ఆస్ప‌త్రుల‌లో మాక్ డ్రిల్స్ కూడా నిర్వ‌హించారు.

ఎలాంటి ప‌రిస్థితులు ఎదురైనా వెంట‌నే ఏర్పాట్లు చేయాల‌ని ఇప్ప‌టికే కేంద్రం ఆదేశించింది. ఇదే స‌మ‌యంలో భార‌త్ బ‌యోటెక్ త‌యారు చేసిన నాస‌ల్ వ్యాక్సిన్ల‌కు కేంద్రం అనుమ‌తి ఇచ్చింది. ఇక వ్యాక్సిన్ల‌కు సంబంధించి టీకా త‌యారీ సంస్థ ధ‌ర‌లు కూడా ప్ర‌క‌టించింది. మ‌రో వైపు ప్ర‌తి ఒక్క‌రు మాస్కులు ధ‌రించాల‌ని, బూస్ట‌ర్ డోస్ వేసుకోవాల‌ని, భౌతిక దూరం పాటించాల‌ని కేంద్ర స‌ర్కార్ కోరింది.

Also Read : ఇంట్రా నాస‌ల్ వ్యాక్సిన్ల ధ‌ర‌లు ప్రియం

Leave A Reply

Your Email Id will not be published!