Bharat Bio Tech BE Vaccine : 250 మిలియ‌న్ల వ్యాక్సిన్లు రెడీ

భార‌త్ బ‌యో టెట్ వెల్ల‌డి

Bharat Bio Tech BE Vaccine : హైద‌రాబాద్ కు చెందిన ప్ర‌ముఖ ఫార్మా సంస్థ‌లు బ‌యోలాజిక‌ల్ – ఇ, భార‌త్ బ‌యోటెక్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశాయి. ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి రానుంద‌ని హెచ్చ‌రిక‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే కేంద్ర స‌ర్కార్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌ను అల‌ర్ట్ చేసింది.

ఈ మేర‌కు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను కూడా విడుద‌ల చేసింది. మాక్ డ్రిల్ లు కూడా నిర్వ‌హించారు. ఈ త‌రుణంలో ముక్కు ద్వారా వ్యాక్సిన్ల‌ను వేసేందుకు గాను అందుబాటులోకి తీసుకు వ‌చ్చాయి స‌ద‌రు కంపెనీలు వ్యాక్సిన్ల‌ను. క‌రోనా గురించి భ‌యాందోళ‌న‌కు గురి కావాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొన్నాయి.

ఇప్ప‌టికే ఈ కంపెనీలు త‌యారు చేసిన నాస‌ల్ వ్యాక్సిన్ల‌కు కేంద్ర స‌ర్కార్ ఆమోదం తెలిపింది. దీంతో మార్కెట్ లో వ‌చ్చే ఏడాది 2023 జ‌న‌వ‌రి నాలుగో వారంలో అందుబాటులోకి వస్తాయ‌ని పేర్కొన్నాయి బ‌యోలాజిక‌ల్ ఇ , భార‌త్ బ‌యోటెక్. ఇదిలా ఉండ‌గా 250 మిలియ‌న్ల కోవిడ్ వ్యాక్సిన్లు నిల్వ ఉన్నాయ‌ని(Bharat Bio Tech BE Vaccine) వెల్ల‌డించాయి.

ఎంత మందికి కావాల‌న్నా ఉత్ప‌త్తి చేసే స్థితిలో తాము ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశాయి. ఇక బ‌యోలాజిక‌ల్ ఇ త‌న కోవిడ్ 19 వ్యాక్సిన్ కార్పెవాక్స్ 200 మిలియ‌న్ డోసుల‌ను క‌లిగి ఉంది. కాగా భార‌త్ బ‌యో టెక్ 50 మిలియ‌న్ డోస్ కోవ్యాక్సిన్ స్టాక్ క‌లిగి ఉన్నాయ‌ని తెలిపాయి.

మొత్తం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను ముందు జాగ్ర‌త్త‌గా వ్యాక్సిన్ల‌ను త‌యారు చేయ‌డంలో నిమ‌గ్న‌మైన‌ట్లు పేర్కొన్నాయి.

వ్యాక్సిన్ త‌యారీ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని , 30 కోట్ల డోస్ ల కార్పెవాక్స్ ను ఉత్ప‌త్తి చేశామ‌ని బీఈ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్ట‌ర్ విక్ర‌మ్ ప‌రాద్క‌ర్ తెలిపారు.

Also Read : 24 గంట‌ల్లో 188 క‌రోనా కేసులు

Leave A Reply

Your Email Id will not be published!