Pilot Rohit Reddy High Court : హైకోర్టు షాక్ ‘పైల‌ట్’ ప‌రేషాన్

ఆఫ‌ర్ ఇచ్చిండ్రు కానీ పైస‌లు ఇవ్వ‌లే

Pilot Rohit Reddy High Court : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కోలుకోలేని షాక్ త‌గిలింది తాండూరు ఎమ్మెల్యే పైల‌ట్ రోహిత్ రెడ్డికి(Pilot Rohit Reddy High Court). ఆయ‌న‌ను ఇప్ప‌టికే రెండు సార్లు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ విచార‌ణ చేప‌ట్టింది.

మ‌రోసారి విచార‌ణ చేప‌ట్టేందుకు ఎమ్మెల్యేకు స‌మ‌న్లు జారీ చేసింది. దీనిని స‌వాల్ చేస్తూ పైల‌ట్ కోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ కె. ల‌క్ష్మ‌ణ్ నిరాక‌రించారు.

త‌దుప‌రి విచార‌ణ‌ను జ‌న‌వ‌రి 5కు వాయిదా వేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ లోగా ఈడీ కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశించారు. విచిత్రం ఏమిటంటే పైల‌ట్ రోహిత్ రెడ్డి త‌ర‌పున వైసీపీ ఎంపీ నిరంజ‌న్ రెడ్డి వాదించ‌డం విశేషం. త‌న క్ల‌యింట్ ను ఇబ్బంది పెడుతున్నార‌ని, రూ. 100 కోట్లు ఇస్తామ‌ని ఆఫ‌ర్ ఇచ్చింది నిజ‌మేన‌ని కానీ ఒక్క పైసా కూడా ఇవ్వ‌లేద‌ని పేర్కొన్నారు. దీనిపై న్యాయ‌మూర్తి కీల‌క ప్ర‌శ్న వేశారు.

ఎందుకోస‌మ‌ని అంత డ‌బ్బులు మీకు మాత్ర‌మే ఇస్తార‌ని అనుకున్నారో చెప్పాల‌న్నారు. దీనికి ఎలాంటి స‌మాధానం ఇవ్వ‌లేక దాట వేశారు. మునుగోడు ఉప ఎన్నిక‌కు ముందు ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా చాలా ర‌స‌వ‌త్త‌రంగా సాగింది. దీనికి సంబంధించి కేంద్రం త‌న స‌ర్కార్ ను కూల్చాల‌ని చూసిందంటూ సాక్షాత్తు సీఎం కేసీఆర్ బ‌య‌ట పెట్టారు. ఇప్ప‌టికే సిట్ దూకుడు ప్ర‌ద‌ర్శించింది. నోటీసులు కూడా జారీ చేసింది.

కానీ ఈ కేసుకు సంబంధించి సిట్ ద‌ర్యాప్తు చెల్ల నేర‌దంటూ బీజేపీ కోర్టుకు ఎక్కింది. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు సిట్ చెల్ల‌దంటూ తీర్పు చెప్పింది. ఆపై సీబీఐకి అప్ప‌గించాల‌ని ఆదేశించింది. దీంతో రాజ‌కీయం కేంద్రం వ‌ర్సెస్ రాష్ట్రంగా మారింది. ఎవ‌రు రాజ‌కీయం చేస్తున్నార‌నేది త్వ‌ర‌లో తేలుతుందా లేదా అన్న‌ది చూడాలి.

Also Read : పాల‌న అస్త‌వ్య‌స్తం తెలంగాణ విధ్వంసం

Leave A Reply

Your Email Id will not be published!