Kandukuru Sabha Stampede : క‌న్నీళ్లు మిగిల్చిన కందుకూరు స‌భ‌

ఎనిమిది మంది మృతి ..మ‌రికొంద‌రికి గాయాలు

Kandukuru Sabha Stampede : ఇదేం ఖ‌ర్మ పేరుతో తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు ఆధ్వర్యంలో కందుకూరులో చేప‌ట్టిన స‌భ అర్ధాంత‌రంగా ముగిసింది. క‌న్నీళ్ల‌ను మిగిల్చింది. విప‌రీత‌మైన తొక్కిస‌లాట(Kandukuru Sabha Stampede) కార‌ణంగా ఏకంగా ప‌లువురు ప్రాణాలు కోల్పోయారు. మ‌రికొంద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది.

ఈ ఘ‌ట‌న‌పై చంద్ర‌బాబు నాయుడు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అమాయ‌కులు చ‌ని పోవ‌డం త‌న‌ను క‌లిచి వేసింద‌న్నారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు రూ. 10 ల‌క్ష‌ల ప‌రిహారం అందించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు నారా చంద్ర‌బాబు నాయుడు.

టీడీపీ అధినేత ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కందుకూరులో స‌భ‌ను ఏర్పాటు చేశారు. ఊహించ‌ని రీతిలో భారీ ఎత్తున ఈ స‌భ‌కు హాజ‌ర‌య్యారు. దీంతో తీవ్ర తొక్కిస‌లాట చోటు చేసుకుంది. సభా ప్రాంగణానికి ద‌గ్గ‌ర లో ఉన్న గుడంక‌ట్ట ఔట్ లేట్ కాలువ‌లో అదుపుత‌ప్పి ప‌డి పోయారు. దీంతో హుటా హుటిన ప‌డి పోయిన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

ఏడుగురు మ‌ర‌ణించిన‌ట్లు స‌మాచారం. ఇంకా ఐదుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలిసింది. చాలా మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. దీంతో స‌భ‌ను అర్ధాంత‌రంగా ముగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు నారా చంద్ర‌బాబు నాయుడు. బాధితుల‌కు మెరుగైన వైద్య చికిత్స అందించాల‌ని కోరారు.

ఇదిలా ఉండ‌గా కందుకూరు ఘ‌ట‌నపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు టీడీపీ నేత నారా లోకేశ్ . వారి మ‌ర‌ణం పార్టీకి తీర‌ని లోటు అని పేర్కొన్నారు. మృతుల కుటుంబాల‌ను పార్టీ ఆదుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి, బీజేపీ చీఫ్ సోమూ వీర్రాజు తీవ్ర సంతాపం తెలిపారు.

Also Read : ఘ‌ట‌న బాధాకరం మృతుల‌కు సంతాపం

Leave A Reply

Your Email Id will not be published!