TTD Alert : కరోనా భయం టీటీడీ అప్రమత్తం
మార్గదర్శకాలు పాటించక పోతే నో ఎంట్రీ
TTD Alert : కరోనా మహమ్మారి మరోసారి భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కోవిడ్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించింది.
దీంతో తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. రానున్నది కొత్త సంవత్సరం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు పుణ్య క్షేత్రాలకు వెళ్లనున్నారు. దీంతో కోట్లాది మంది భక్తులను కలిగి ఉన్న తిరుమలకు భక్తులు భారీగా తరలి రానున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ముందు జాగ్రత్తగా నిబంధనలు పాటించాలని సూచించింది(TTD Alert).
ఈ మేరకు టీటీడీ చైర్మన్ వైవీఎస్ సుబ్బారెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇక ఈవో ధర్మారెడ్డి తనయుడు ఆకస్మిక మృతితో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శిగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ ను 12 రోజుల పాటు తాత్కాలిక ఈవోగా నియమించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది టీటీడీ.
ఇక జనవరి 2 నుంచి వైకుంఠ ఏకాదశి పర్వదినాలు ప్రారంభం అవుతాయి. 11వ తేదీ అర్ధరాత్రి దాకా ఆలయం తెరిచి ఉంచనున్నట్లు తెలిపారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. టైం స్లాట్ సర్వ దర్శనానికి సంబంధించిన టోకెట్లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. భక్తుల కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ , నారాయణగిరి షెడ్లు , ఇతర ప్రాంతాల్లో అన్నప్రసాదాలు, తాగు నీరు, టీ, కాఫీ పంపిణీ చేయనున్నారు. 11 వ తేదీ వరకు వీఐపీల సిఫార్సు లేఖలు స్వీకరించేది లేదని పేర్కొన్నారు.
Also Read : టోకెన్లు ఉంటేనే స్వామి దర్శనం