TSPSC Jobs : వ్యవసాయ..విద్యా శాఖలో జాబ్స్
ప్రకటించిన టీఎస్పీఎస్సీ
TSPSC Jobs : తెలంగాణ సర్కార్ జాబ్స్ ను ప్రకటించేందుకు పర్మిషన్ ఇస్తోంది. ఇక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఆదరా బాదరాగా నోటిఫికేషన్లు(TSPSC Jobs ) జారీ చేస్తోంది. కానీ ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేసిన దాఖలాలు లేవు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి పచ్చ జెండా ఊపింది. తాజాగా మరో రెండు నోటిఫికేషన్లను ప్రకటించింది.
ఇందులో ఒకటి వ్యవసాయ శాఖ కాగా మరొకటి ఇంటర్మీడియట్ బోర్డులో ఖాళీల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటి ద్వారా మొత్తం 276 పోస్టులను భర్తీ చేయనుంది. ఇదిలా ఉండగా వచ్చే ఏడాది 2023 జనవరి 6 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొంది.
ఖాళీలకు సంబంధించి చూస్తే విద్యా శాఖలో , వ్యవసాయ శాఖలో వీటిని భర్తీ చేయనున్నారు. టెక్నికల్ ఎడ్యుకేషన్ (సాంకేతిక విద్య) శాఖలో 37 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ఉండగా , ఇంటర్మీడియట్ శాఖలో 91 పీడీ పోస్టులను నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 6న దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమై 27న ముగుస్తుందని తెలిపింది.
వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్ (వ్యవసాయ శాఖ అధికారి ) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో మల్టీ జోన్ -1 లో 100 ఏఓ పోస్టులు ఉండగా మల్టీ జోన్ -2 లో 48 ఖాళీలను నింపనుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ .
ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేసుకునేందుకు జనవరి 10 నుంచి 30వ తేదీ వరకు స్వీకరిస్తారు. ఇతర వివరాలకు సంబంధిత శాఖ వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించింది టీఎస్పీఎస్సీ.
Also Read : 250 మిలియన్ల వ్యాక్సిన్లు రెడీ