Rahul Security Row : రాహుల్ గాంధీ ప్రోటోకాల్ ఉల్లంఘన
ప్రకటించిన కేంద్ర హోం శాఖ
Rahul Security Row : కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది కేంద్ర హోం శాఖ. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ పై సీరియస్ గా స్పందించింది. ఆయన భద్రతకు సంబంధించి ప్రోటోకాల్ ను ఉల్లంఘించారంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు ఇవాళ అధికారికంగా వివరణ ఇచ్చింది.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర హోం శాఖ రాహుల్ గాంధీకి భద్రత(Rahul Security Row) కల్పించడంలో విఫలమైందని ఆరోపించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాకు లేఖ రాసింది. తమ నాయకుడు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న సమయంలో పెద్ద ఎత్తున జనం హాజరయ్యారని, వారిని నియంత్రించడంలో భద్రతా సిబ్బంది విఫలమయ్యారంటూ ఆరోపించింది. ఇందుకు సంబంధించి పూర్తి సెక్యూరిటీ కల్పించాలని కోరింది.
పార్టీ తరపున ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కేంద్రానికి రాహుల్ సెక్యూరిటీ విషయమై లేఖ రాశామని వెల్లడించారు. కేంద్రం కావాలని తమ నేతకు సెక్యూరిటీ కల్పించడం లేదంటూ ఆరోపించారు. దీనిపై కేంద్రం తీవ్రంగా తప్పు పట్టింది. కావాలని తమ సర్కార్ పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది కేంద్ర హొం మంత్రిత్వ శాఖ.
ఇదిలా ఉండగా ప్రోటోకాల్ ఉల్లంఘించినందుకు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది కేంద్ర హోం శాఖ. దీంతో రాహుల్ సెక్యూరిటీ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. మరో వైపు కరోనా కారణంగా పాదయాత్రను నిలిపి వేసుకునే ఆలోచన చేయాలని కేంద్ర మంత్రి మున్సుఖ్ కోరారు. ఈ మేరకు ఆయన లేక రాయడం కలకలం రేపింది.
Also Read : రాజీవ్ ఉన్నప్పుడే జర్నీ ప్రారంభం