DGP Mahender Reddy : 31న ప‌ద‌వీ విర‌మ‌ణ చేస్తున్నా – డీజీపీ

వార్షిక నివేదిక విడుద‌ల

DGP Mahender Reddy : ఈ నెలాఖ‌రు వ‌ర‌కే ఉండ‌నున్నారు డీజీపీగా మ‌హేంద‌ర్ రెడ్డి(DGP Mahender Reddy) ఆయ‌న స్థానంలో ఎవ‌రు పోలీస్ బాస్ గా వ‌స్తార‌నేది ఉత్కంఠ రేపుతోంది. ఇది ప‌క్క‌న పెడితే తాను ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించాక ప‌రిస్థితిని కంట్రోల్ లోకి తీసుకు వ‌చ్చారు. కీల‌క‌మైన మార్పులు చేశారు. త‌న‌దైన ముద్ర ఉండేలా జాగ్ర‌త్త ప‌డ్డారు.

ఇందులో భాగంగా గురువారం డీజీపీ రాష్ట్ర పోలీసు వార్షిక రిపోర్టు విడుద‌ల చేశారు. నేరాల శాతం 4.4 కు పెరిగింద‌ని వెల్ల‌డించారు. ఇందులో సైబ‌ర్ నేరాలు 57 శాతం ఉండ‌గా చోరీలు 7 శాతం , కిడ్నాప్ లు 15 శాతం ఉన్నాయ‌ని, మ‌హిళ‌ల‌పై 3.8 శాతం పెరిగాయ‌ని పేర్కొన్నారు డీజీపీ.

రాష్ట్ర పోలీసు శాఖ వినూత్నంగా ఏర్పాటు చేసిన డ‌య‌ల్ 100 ద్వారా 13 ల‌క్ష‌ల ఫిర్యాదులు అందిన‌ట్లు తెలిపారు మ‌హేంద‌ర్ రెడ్డి. ఒక్క సామాజిక మాధ్య‌మాల ద్వారానే ఏకంగా ల‌క్షకు పైగా ఫిర్యాదులు వ‌చ్చాయ‌ని పేర్కొన్నారు . ఇక ఠాణాల్లో 5 ల‌క్ష‌ల 50 వేల ఫిర్యాదులు న‌మోదైన‌ట్లు చెప్పారు మ‌హేంద‌ర్ రెడ్డి.

దేశంలో ఎక్క‌డా లేని రీతిలో రాష్ట్రంలో సైబ‌ర్ నేరాల ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించామ‌న్నారు. ఇందులో 15 ల‌క్ష‌ల మందికి శిక్ష‌ణ ఇచ్చిన‌ట్లు స్ప‌ష్టం చేశారు డీజీపీ. ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో 10 ల‌క్ష‌ల‌కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామ‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 18,234 కేసులు ఛేదించిన‌ట్లు వెల్ల‌డించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 431 మందిపై పీడీ యాక్ట్ న‌మోదు చేసిన‌ట్లు చెప్పారు మ‌హేంద‌ర్ రెడ్డి. వేలి ముద్ర‌ల ద్వారా ప‌లువురి నిందితుల‌ను గుర్తించిన‌ట్లు వెల్ల‌డించారు. కొత్త బాస్ ఎవ‌రు వ‌స్తార‌నేది తేలాల్సి ఉంది.

Also Read : న‌యీం అనుచ‌రుడు శేష‌న్న‌పై పీడీ యాక్ట్

Leave A Reply

Your Email Id will not be published!