PM Modi Mother Cremated : తల్లికి తనయుడి తుది వీడ్కోలు
ముగిసిన హీరా బెన్ అంత్యక్రియలు
PM Modi Mother Cremated : తీవ్ర అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూసిన ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ తల్లి హీరా బెన్ మోదీ అంత్యక్రియలు ముగిశాయి. గుజరాత్ లోని గాంధీ నగర్ శ్మశాన వాటికలో పూర్తి చేశారు. చివరిసారిగా తన తల్లి పార్థివ శరీరాన్ని మోశారు నరేంద్ర మోదీ. ఇటీవలే హీరా బెన్ వందేళ్లు పూర్తి చేసుకున్నారు. మంగళవారం అనారోగ్యం కలగడంతో వెంటనే అహ్మదాబాద్ లోని ఆస్పత్రికి తరలించారు.
నిన్నటి వరకు బాగానే ఉన్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కానీ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచినట్లు తెలిపడంతో హుటాహుటిన ప్రధానమంత్రి అక్కడికి చేరుకున్నారు. చాలా సాధారణంగా అంతిమయాత్ర(PM Modi Mother Cremated) చేపట్టారు. తన సోదరుడు పంకజ్ మోదీ ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి తల్లి హీరా బెన్ ను గాంధీనగర్ లోని సెక్టార్ 30 శ్మశాన వాటికకు తీసుకు వెళ్లారు.
కుటుంబీకులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇదిలా ఉండగా తన జీవితాంతం హీరా బెన్ తన పనులు తానే చేసుకున్నారు. ఎవరిపై ఆధారపడ లేదు. ఒక రకంగా ఆమె జీవితం ఎందరికో ఆదర్శ ప్రాయం అని చెప్పక తప్పదు. కాగా హీరా బెన్ మోదీ మరణం పట్ల వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్య మంత్రులు, గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు.
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, శశి థరూర్, డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ చీఫ్ గులాం నబీ ఆజాద్ , క్రికెటర్లు , వ్యాపారవేత్తలు తీవ్ర సంతాపం తెలిపారు.
Also Read : మోదీ మాతృమూర్తి హీరా బెన్ ఇక లేరు